మళ్లీ తన రేంజ్ చాటిన ప్రభాస్


బాహుబలితో బాలీవుడ్ స్టార్ అయిపోయిన ప్రభాస్ తన స్థానాన్ని తనకొచ్చిన పేరు పోగొట్టుకోవడానికి అసలు ఇష్టపడటం లేదు. ఏ కోశానా తాను తన స్థాయిని తగ్గించుకోవడం లేదు. కరోనా సందర్భంలో 4 కోట్లు విరాళం ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత ఒక అడవిని దత్తత తీసుకుని ఆశ్చర్యపరిచాడు. తాజాగా హైదరాబాద్ వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.

టాలీవుడ్ ప్రకటించిన సాయాల్లో ప్రభాస్ దే నెం.1 కావడం విశేషం. అతను ఏ విషయంలో తన స్థానాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక నిరంతరం కేటీఆర్, కేసీఆర్ అభిమానం కోరుకునే చిరంజీవి... రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించడం విశేషం.  వీరితో పాటు మహేష్ బాబు కూడా రూ.కోటి సాయం ప్రకటించారు.

ఇంకా అనేక మంది తమ విరాళాలు ప్రకటించారు. ఎన్టీఆర్ 50 లక్షలు, నాగార్జున రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. రవితేజ 10 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు ప్రకటించారు.  విజయదేవరకొండ 10 లక్షలు ప్రకటించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.