ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. అయితే, సాధారణంగా శాఖలను కేటాయించడంలో ఒకటి రెండు రోజులు సమయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ…జగన్ ఈ రోజే మంత్రులకు శాఖలను కూడా కేటాయించేశారు. తాజాగా, ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారో తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్రెడీ ముందస్తుగానే జగన్, సజ్జలలు మేథోమధనం చేసి తయారు చేసిన మంత్రుల శాఖలు వారి అనుభవానికి తగ్గట్లుగానే ఉన్నాయన్న టాక్ వస్తోంది.
ఏపీ కేబినెట్లో గతంలో మాదిరే ఐదుగురు డిప్యూటీ సీఎంలు కొనసాగనున్నారు. ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలను కూడా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత కేబినెట్లో డిప్యూటీ సీఎంలుగా కొనసాగిన వారిలో కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ), అంజాద్ బాషా (మైనారిటీ)లు ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు. పుష్ప శ్రీవాణి స్థానంలో ఎస్టీ కోటాలో కొత్తగా పీడిక రాజన్నదొర (ఎస్టీ), కొట్టు సత్యనారాయణ (కాపు), బూడి ముత్యాలనాయుడు (బీసీ)లకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. అయితే, ఈసారి డిప్యూటీ సీఎంగా మహిళకు స్థానం దక్కకపోవడం గమనార్హం.
కొత్త మంత్రులు…వారికి కేటాయించిన శాఖలు
1. బొత్స సత్యనారాయణ : విద్యా శాఖ
2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్థిక శాఖ
3. అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
4. ఆర్కే రోజా : పర్యాటక శాఖ
5. ఆదిమూలపు సురేశ్ : పురపాలక శాఖ
6. తానేటి వనిత : హోం శాఖ
7. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమం
8. కారుమూరి నాగేశ్వరరావు : పౌర సరఫరాల శాఖ
9. కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ
10. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : గనుల శాఖ
11. గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమలు, ఐటీ శాఖ
12. జోగి రమేశ్ :గృహ నిర్మాణ శాఖ
13. గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
14. ఉషశ్రీ చరణ్ :మహిళా శిశు సంక్షేమ శాఖ
15. పీడిక రాజన్న దొర : గిరిజన సంక్షేమం
16. సీదిరి అప్పలరాజు : పశుసంవర్ధక శాఖ
17. దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
18. ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ శాఖ
19. మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
20. కాకాణి గోవర్ధన్ రెడ్డి : వ్యవసాయ శాఖ
21. నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ
22. అంజాద్ బాషా : మైనారిటీ సంక్షేమం
23. పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
24. విడదల రజని : వైద, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
25. బూడి ముత్యాలనాయుడు : పంచాయతీరాజ్