చింత చచ్చినా పులుపు చావలేదు అన్న రీతిలో వైసీపీ నేతలు మాత్రం అధికారం పోయి 11 సీట్లకే పరిమితమైనప్పటికీ తమ నోటి దురుసు తగ్గించుకోవడం లేదు. త్వరలోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ఎక్కడున్నా సరే బట్టలూడదీస్తామని పోలీసులకే మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వార్నింగులు ఇస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను వదలబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాకాణిపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ మంత్రి కాకాణి ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులతో కాకాణి అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే కాకాణిపై కేసు నమోదైంది.