ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 వివాదం ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గత నెల డిసెంబ రు 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నుంచి ఇటీవలే రెగ్యులర్ బెయిల్ లభించింది. అయినా.. షరతులు పేర్కొన్నారు. ప్రతి ఆదివారం స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టాల ని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇంతలోనే మరో రూపంలో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గోపాలపురం పోలీస్టేషన్ అధికారులు తాజాగా అల్లుకు నోటీసులు జారీ చేశారు.
“అర్జున్ సర్.. మీరు రావొద్దు.. వస్తే కనుక తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉం టుంది“ అని గోపాలపురం పోలీసులు స్పష్టం చేశారు. అది కూడా తమకు ముందస్తు సమాచారం ఇచ్చి రావాలని తెలిపారు. ఒకవేళ వచ్చినా.. ఏం జరిగితే దానికి పూర్తి బాధ్యత అర్జున్‌దేనని తెలిపారు. మొత్తంగా ఇప్పుడు అర్జున్‌కు మరో ఇరకాటం వచ్చింది. దీంతో ఆయన ఇల్లు కదలాలా? వద్దా? అనే సందేహంలో చిక్కుకున్నారు. ఇల్లు కదిలితే ఒక తంటా.. ఇంట్లోనే ఉంటే మరో తంటా .. అన్నట్టుగా ఆయన పరిస్థితి మారింది.
విషయం ఏంటి?
డిసెంబరు 4న హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి.. బాలుడిని పరామర్శించాలనేది అల్లు అర్జున్ భావన. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసులను పర్మిషన్ కోరారు. దీనికి వారు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా.. ఏదైనా జరిగితే అల్లు అర్జున్‌దే బాధ్యతన్నది పోలీసుల వాదనగా ఉంది.
దీంతో ఈ విషయంపై అల్లు అర్జున్ న్యాయనిపుణుల సలహా కోరుతున్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించడం ఖాయమే అయినా.. పోలీసులు పెడుతున్న నిబంధనలు ఇబ్బందిగా ఉంటున్నాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి.. శ్రీతేజ్‌ను పరామర్శించేలా ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.