కేసీఆర్ బంధువు దామోదర్ రావుకి చెన్నైలో చెంప పెట్టు
రాజ్ న్యూస్’ గొంతు నులమడానికి సిగ్గు, ఎగ్గూ లేకుండా తెగబడ్డారు. అందుకోసం ఏకంగా చెన్నై వెళ్ళి మంతనాలు.. నాలుగు రెట్లు అధిక మొత్తం చెల్లింపులకు సైతం దిగారు. చివరకు అక్కడి యాజమాన్యం ‘ససేమిరా..!’ అనడంతో.. అన్నీ మూసుకొని ‘రిటన్ టికెట్’ దీపావళి డిస్కౌంట్ లో కొనుగోలు చేశారని తెలిసింది.
అసలేం జరిగింది
‘రాజ్ న్యూస్’ గొంతు విప్పటం మొదలెట్టింది. దీంతో ‘గంగవెర్రితనం’తో ఓ ఇద్దరు రంగంలోకి దిగారు. ఇందులో ఒకరి కోసం ఏకంగా అమెరికా జైలు తలుపులు తెరిచి చూడటం గమనార్హం. ఈ ఇద్దరిలో ఒకరు సిఎం కెసిఆర్ బంధువు కావడం విశేషం.
ఇలా బేరసారాలు
‘రాజ్ న్యూస్’ అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న రవిప్రకాష్ తనదైన బాణీలో వార్తా కథాంశాలు అందిస్తున్నారు. ఇంత వరకు ప్రజలకు ఓకే..! కానీ ‘రాజ్ న్యూస్’ ప్రభంజనం చూసి తట్టుకోలేక ‘పోయిన’ వారు రంగంలోకి దిగారు. హుటాహుటిన చెన్నై హెడ్ ఆఫీస్ కి వెళ్లి ‘రవిప్రకాష్’ చెల్లించిన మొత్తం కంటే నాలుగు రేట్లు అధికంగా చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సి.ఎం. దగ్గర బంధువు దమోదర రావు, అతని సన్నిహితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ లు. అయితే ‘రాజ్ న్యూస్’ యాజమాన్యం వ్యాపార నీతికి కట్టుబడటంతో ఈ పప్పులు ఉడకలేదు. చర్చలు విఫలం చెందడంతో వెనుదిరిగిన సీఎం దగ్గర బంధువు.. దీపావళి డిస్కౌంట్ టికెట్ పై రిటన్ టికెట్ బుక్.చేసుకున్నట్లు తెలిసింది.
ఇదీ నీతి అంటే
కారణం ఏమిటంటే రవిప్రకాష్ తో మూడు సంవత్సరాల ఒప్పందం కుదిరిందని, మధ్యలో ఇప్పుడు విరమించుకోవడం సాధ్యంకాదని సూటిగా చెప్పిన ‘రాజ్ న్యూస్’ యాజమాన్యం వ్యాపార నీతికి కట్టుబడింది. మూడు సంవత్సరాల తర్వాత మీతో అగ్రిమెంటుకు సిద్ధంగా ఉన్నామని ‘చావు కబురు’ చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చి మరీ చెప్పింది.
చెమ్మ చెక్క- నాలుగేసి ఛానళ్ళు
దీనెమ్మ జీవితం.. ఒక్క ఛానల్ ఉంటేనే ఇలా ఉంటే..
అసలు విషయం తెలిస్తే.. గుండెలు బేజారెత్తడం ఖాయం. అసలు విషయం ఏమిటంటే రవి ప్రకాష్ ‘రాజ్ న్యూస్’తో పాటు మరో మూడు ఛానల్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం పాపం ఈ ‘తెల్ల మాలోకాలకు’ ఇం తెల్వద్. ఒక్క ఛానల్ ఉంటేనే రవితేజంల వెలుగోందిన వాడికి నాలుగు చానల్స్ వస్తే ఆ ‘స్టంట్ సినిమా’ ఎలా ఉంటుందో కండింగ్ గొళ్ళకు అతి త్వరలో అర్థం అవుతుంది.