ఈ ఏడాది మహాశివరాత్రికి థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రం `మజాకా`. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రితూ వర్మ జంటగా నటించారు. రావు రమేష్, `మన్మధుడు` హీరోయిన్ అన్షు, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా..లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 26న మజాకా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మజాకాలో సెన్సార్ కట్ కు గురైన పిఠాపురం ఎమ్మెల్యే డైలాగ్ బయటపెట్టాడు. ఖుషి చిత్రంలోని నడుము సన్నివేశాన్ని మజాకాలో రావు రమేష్, అన్షు మధ్య రీ క్రియేట్ చేశారట. అన్షు నడుము చూసి షేక్ అవుతున్న రావు రమేష్ ను సందీప్ కిషన్ `ఏమైంది నాన్నా?` అని అడుగుతాడట.
అప్పుడు రావు రమేష్ `పిఠాపురం ఎమ్మెల్యే(పవన్ కళ్యాణ్) గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడి ఉంటారో ఇప్పుడు అర్థం అవుతోంది` అంటూ డైలాగ్ చెబుతారట. అయితే ఈ డైలాగ్ ను కాంట్రవర్సీ కాకూడదు అనే ఉద్దేశంతో సెన్సార్ బోర్ట్ కట్ చేసిందని సందీప్ కిషన్ తెలిపాడు. ఏదేమైనా పిఠాపురం ఎమ్మెల్యే డైలాగ్ మజాకాలో ఉండుంటే నెక్స్ట్ లెవల్ అయ్యుండేది. కాగా, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మజాకా చిత్రం యు/ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చారు.