2018లో విడుదలైన సూపర్ హిట్ సెన్సేషన్ `ఆర్ఎక్స్ 100` తో భారీ క్రేజ్ సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించింది. కానీ ఆర్ఎక్స్ 100 స్థాయి హిట్ మాత్రం పడలేదు. కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో `మంగళవారం` మూవీతో పాయల్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రంలో తన విశ్వరూపం చూపించారు. మంగళవారం మూవీ తర్వాత పాయిల్ ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ హిట్ పడినా పాయల్ కు సరైన ఛాన్సులు మాత్రం దక్కడం లేదు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాయల్ రాజ్పుత్ తాజాగా తన ఎక్స్ ఖాతా వేదికగా ఎమెషనల్ పోస్ట్లు పెట్టింది. `నటిగా ఉండటం అనేది అత్యంత కఠినమైన కెరీర్లలో ఒకటి. ప్రతి రోజు అనిశ్చితి భారంతో మొదలవుతుంది. ఎందుకంటే నేను ప్రతి రోజు టాలెంట్ ను కప్పివేసే నెపోటిజం, పక్షపాతం నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను.
నేను అంకితభావంతో ఎంత కష్టపడుతున్నా వెలుగులు మాత్రం కనిపించడం లేదు. అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోతున్నాయి. తమ ఇంటిపేరు ఉపయోగించికుని కొందరు.. శక్తివంతమైన ఏజెంట్ల ద్వారా మరికొందరు అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఆదిపత్యం చెలాయించే ఈ రంగుల ప్రపంచలో కేవలం ప్రతిభతోనే నేను రాణించగలనా అని ప్రశ్నించుకుంటే సందేహమే కలుగుతుంది.` అంటూ పాయల్ ఎక్స్ వేదికగా తన ఆవేదన మొత్తాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం పాయల్ ట్వీట్ వైరల్ గా మారడంతో.. అభిమానులు, నెటిజన్లు `ఓపిక పట్టండి తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయి` అంటూ భరోసా ఇస్తున్నారు.
Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal
— paayal rajput (@starlingpayal) April 1, 2025