రాయలసీమను వరదలు చుట్టుముట్టాయి
మనుషులు, పశు సంపద కొట్టుకుపోతున్నాయి.
ఎంతో మంది చనిపోయారు.
లక్షల మంది నిరాశ్రయులయ్యారు
వేల మంది ఆస్తులు పోగొట్టుకున్నారు
ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
ఇంత జరుగుతుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు హాజరవుతున్నారు.
పైగా అతి కీలక వరద సమీక్షను రక్షణ చర్యలను గాలికి వదిలేశారు.
ఇందుకోసమా జగన్ కి ఓటేసిందని జనం గోల పెడుతున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగా స్పందించారు.
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘యిసుక అమ్ముతాం ‘ అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ??
అంటూ పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
ఈ ట్వీట్ తో పాటు కొన్ని ఫొటోలు షేర్ చేశారు పవన్ కళ్యాణ్
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021
రాయలసీమలో 52 సీట్లుక గాను జగన్ కి 49 సీట్లు ఇచ్చారు ప్రజలు. అలాంటి చోట ప్రజలకు వరదలకు ముందే అప్రమత్తం చేయలేదు.
వర్షం వచ్చాక కూడా సహాయక చర్యలు చేపట్టలేదు. జనం ఆకలిదప్పులతో అల్లాడుతున్నారు. ఎంతో మంది ఘోరంగా ఇరుక్కున్నారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు.