అన్ని తిరిగి ఇచ్చేస్తాం ????????@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/cdH8tP0nQJ
— Prasannakumar Nalle (@PrasannaNalle) November 27, 2022
వైసీపీ కీలకనాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైకి కనిపించే ముఖ్యమంత్రి ఒకరు, తెరవెనుక ఉన్న డిఫ్యాక్టో సీఎం మరొకరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ.. సజ్జలపై నిప్పులు చెరిగారు.
డిఫ్యాక్టో సీఎం ఆదేశాలతోనే జనసేన అభిమానులు.. మద్దతు దారులపై దాడులు జరుగుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డిఫ్యాక్టో సీఎం సంగతి ని కూడా తేలుస్తామన్నారు.
“2014 తర్వాత ప్రధానిని మూడు, నాలుగు సందర్భాల్లో కలిశాను. నేనేం మాట్లాడానో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు డిఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్నారెడ్డి అడుగుతున్నారు. నా దగ్గరకు రండి.. మీ చెవిలో చెప్తా. నేనెప్పుడు మాట్లాడినా దేశభద్రత, సగటు మనిషి రక్షణే కోరుకుంటా. నేను మీలా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పను. మీలాగా అమ్మలక్కల రాజకీయాలు చేయడానికి కాదు నేను వచ్చింది. ఒక పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. చేగువేరా.. వంటివారిని చూసి పోరాటం నేర్చుకున్నాను“ అని పవన్ వ్యాఖ్యానించారు.
“వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధాని మోడీకి చెప్పి చేయను.. నేనే చేస్తా. ఇది నా నేల.. ఈ నేలలోనే పుట్టినోడిని.. ఆంధ్రుడిని.. ఆంధ్రలోనే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ వెళ్లి అడగలేదు. అడగను కూడా. మేమే తేల్చుకుంటాం. అధికారం లేనోడిని.. నామీద పడి ఏడుస్తారేంటి? ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరు ఎలా గెలుస్తారో మేమూ చూస్తాం’’ అని పవన్ సవాల్ రువ్వారు.
“మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ. అన్నట్టుగా మేం మీ విషయంలో అలానే ప్రవర్తిస్తాం. పాలకులు మంచి వాళ్లు కాకపోతే.. ప్రత్యర్థుల్లో మంచిని మీరు చూడాలనుకోవడం భ్రమ. మేం కూడా మీరు తినే ఉప్పే తింటున్నాం.. మీరు తినే కారమే తింటున్నాం. మాకు మీకన్నా ఎక్కువ పౌరుషమే ఉంది. మీ మీ బాధితులం. మీకు ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో .. అలానే కొడతాం.ఒకటికి రెండు, రెండుకు నాలుగు లెక్కన అన్నీ వడ్డీ, చక్రవడ్డీతో తీర్చేస్తాం“ అని పవన్ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.