రాజకీయాల్లో వైరం ఎప్పుడూ కొనసాగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. వైరి పక్షాల మధ్య పొలిటికల్ దూకుడు ఎప్పుడూ ఉంటుంది. ఇదే ఇప్పుడు మరోసారి తెరమీదికి వచ్చింది. వైసీపీ అధినేతను, వైసీపీ పార్టీని కూడా తీవ్రంగా విభేదించే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం జగన్కు చెక్ పెడుతోందని అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీని హోరా హోరీ పోరులో పవన్-చంద్రబాబు సంయుక్తంగా మట్టికరిపించారు.
దీంతో 11 స్థానాలకు పరిమితమైన జగన్.. ఇంటిపట్టునే ఉంటున్నారు. మొహం చూపించే పరిస్థితి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. వేకేషన్ మాదిరిగా అప్పుడప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వస్తున్నారు. ఇలా.. ఆరుమాసాలు పూర్తయ్యాయి. ఇక, జనవరి నుంచి తాను ప్రజల మధ్యకు వస్తానని చెప్పిన ఆయన.. ఎందుకో.. దీనిని కూడా వాయిదా వేసుకుని ఫిబ్రవరి నుంచి ప్రజల ముఖం చూస్తానని ఒట్టు పెట్టుకున్నా రు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంటే.. జగన్ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి జనంలోకి వస్తున్నారు. ప్రజల కష్టాలు.. సూపర్ సిక్స్ హామీలు వంటివి ఆయన కు ప్రధాన అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన పవన్ కల్యాణ్.. దానికి చెక్ పెట్టేందుకు జగన్ను బలంగా నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన పర్యటనలను కూడావాయిదా వేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కూడా జగన్ షెడ్యూల్ ప్రకారం.. జనవరి నుంచే ప్రజల మధ్యకు రావాల్సిఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని.. నెల కిందట జగన్ ప్రకటించిన తర్వాత పవన్ కూడా చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు వచ్చే నెలకు జగన్ షెడ్యూల్ మార్చుకోవడంతో పవన్ కల్యాణ్ కూడా.. తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు. ఈ నెలలో కేవలం పిఠాపురానికే పరిమితం అవుతానని చెప్పిన ఆయన.. వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు వస్తానని.. వారి కష్టాలు వింటానని సెలవిచ్చారు. సో.. మొత్తానికి జగన్ పర్యటన ప్రారంభానికి ముందే ప్రజల మధ్యకు పవన్ రానున్నారు. తద్వారా జగన్ ప్రభావం తగ్గించే వ్యూహాత్మక నిర్నయం తీసుకున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.