జనసేన వేరుగా పోటీ చేస్తుందని ప్రకటించాక ఆ పార్టీని టీఆర్ఎస్ నేతలు ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఓట్లు చీలి తమకు ఉపయోగపడతారని సైలెంట్ గా ఉన్నారు. ఎపుడైతే పవన్ బీజేపీకి మద్దతు ప్రకటించారో ఆ వెంటనే పవన్ టీఆర్ఎస్ కి శత్రువు అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పవన్ ని తిడుతూనే ఉన్నారు.
టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మాట్లాడుతూ… పవన్ అక్కడే ఏమీ చేయలేకపోయాడు. ఆయనే రెండు చోట్లా ఓడిపోయాడు. ఆయన పార్టీలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఆయనతో లేడు. ఇక్కడొచ్చి ఆయన చేసేదేముంది, పొడిచేదేముంది అంటూ ఎద్దేవా చేశారు. మొత్తం టీఆర్ఎస్ కేడర్ పవన్ పై పడింది. నానా మాటలు అంటోంది. అడ్డంగా పరువు తీస్తోంది.
వాస్తవానికి ప్రతిపక్షాలకు, తన శత్రువులకు తాజా వ్యవహార శైలితో పవన్ పెద్ద అస్త్రాన్నే ఇచ్చారు. పవన్ నిర్ణయంపై తన సొంత కేడర్ కూడా సంతోషంగా లేదు. ఇక బీజేపీకి మద్దతు పలకడంతో పవన్ కు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సెగ మొదలైంది. కేసీఆర్ కుటుంబంతో ఫ్రెండ్లీగా ఉందాం అనుకుని ఎంతో ప్రయత్నించే చిరంజీవి కుటుంబానికి పవన్ తెచ్చిన తాజా చిక్కు ఇది.