ప్రజలకు ఎన్నో ఇచ్చామని, ఎంతో చేశామని చెబుతున్న వైసీపీ.. ప్రస్తుత ఎన్నికల్లో వైనాట్ 175 జపాన్ని చేస్తోంది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల తర్వాత.. మాత్రమే ఫలితం వెలువడే అవకాశం ఉండగా.. ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఎన్నికలు పూర్తి కాకుండానే ఫలితం ప్రజల కళ్ల ముందు కనిపిస్తోంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు. ఇక్కడ మరోసారి కూటమి అభ్యర్థి, టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయాన్ని రాసిపెట్టుకున్నారు.
ఇది ఎంత మాత్రం అతిశయోక్తికాదు. ఖచ్చితంగా జరగబోయే పరిణామమనే అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే.. ఇక్కడి వాతావరణం.. ప్రజల మూడ్ను గమనించిన సర్వేలు కూడా.. ఏలూరి విజయం దాదాపు ఖరారైందనే వాదనే వినిపిస్తున్నాయి. వరుస విజయాలు అందుకోవడం ఒక్కటే కొలమానం కాదు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు.. అందిస్తున్న సర్వీసు వంటివి ప్రధానంగా పరుచూరును శాసిస్తున్నాయని చెబుతున్నారు. పరుచూరులో కీలక నేతగానే కాకుండా.. వివాద రహితుడిగా ఏలూరి ఉన్నారు.
ఇటు పార్టీ పరంగా అందరినీ కలుపుకొని పోతున్నారు. అటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వింటు న్నారు. వారికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే.. ఏలూ రికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదే ఆయనకు గత ఎన్నికల్లో బలమైన.. విజయాన్ని అందిం చింది. ఇప్పుడు మరింతగా సమీకరణలు మారిపోయాయి. బీజేపీ+జనసేన వర్గాలు కూడా ఏలూరికి జై కొడుతున్నాయి. వారిని కూడా ఆయన కలుపుకొని పోతున్నారు.
ఈ పరిణామాలతో ఏలూరి.. విజయం నల్లేరుపై నడకే కాదు.. ముందే రాసిపెట్టుకునే రేంజ్లో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఏదేశమేగినా.. అన్నట్టుగా.. పరుచూరు నుంచి వివిధ దేశాలకు వెళ్లి న వారు , ఇదే నియోజకవర్గం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా ఎన్నికల సమయానికి వచ్చి ఏలూరికి మద్దతు చెబుతుండడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 5 వేల ఓట్లు ఎన్నారైలకు ఉన్నాయనేది ఒక లెక్క. ఇవన్నీ కూడా ఏలూరికే పడతాయని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. వైనాట్ 175లో పరుచూరు సీటు టీడీపీ గెలిచే జాబితాలో ఫస్ట్ వరుసలో ఉంటుందని అందరూ ముక్తకంఠంతో చెబుతుండడం గమనార్హం.