పరిషత్తు ఎన్నికలను చంద్రబాబు బ్యాన్ చేసినపుడు ఆయన బ్యాన్ చేసిన విషయంపై అందరూ చంద్రబాబును విమర్శించారు.
కానీ చంద్రబాబు తాను ఎందుకు బహిష్కరించాను అని చెప్పిన కారణాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
ఇపుడు హైకోర్టు ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చాక మళ్లీ చంద్రబాబు ఏం చెప్పాడు అని ఆలోచిస్తున్నారు.
చంద్రబాబు ఏం చెప్పలేదు… సుప్రీంకోర్టు చెప్పినట్లు ఎన్నికలు జరపడం లేదు కాబట్టి బహిష్కరిస్తున్నాం అన్నారు.
ఇపుడు జగన్ సర్కారు ఆలోచనకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎందుకో తెలుసా? హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయమని సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. అసలు హైకోర్టు చెప్పిన కారణం విన్నవాళ్లు ఎవరూ సుప్రీంకోర్టు గడప తొక్కరు. ఎందుకంటే సుప్రీం కోర్టు 4 వారాల గడువుతోనే ఎన్నికల ప్రక్రియ చేపట్టమని చెప్పింది… ఏపీ ఎన్నికల కమిషన్ అలా చేయడం లేదు కాబట్టి హైకోర్టు ఎన్నికలపై స్టే ఇచ్చింది.
సహజంగా ఇపుడు అప్పీలుకు వెళితే ఏం జరగబోతుందో అర్థమైంది కదా.
అంటే గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినందుకు అప్పీలుకు వెళ్లిన ఎన్నికల కమిషనర్ నీలం సహానీకే చీవాట్లు పడే అవకాశం ఉంది.
ఏంటో… ఆమె ఒక మాజీ ఐఏఎస్ అధికారి. ఇంత చిన్న లాజిక్ పట్టించుకోకుండా అప్పీలుకు వెళ్లారు. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఏంటో…