ఏపీలో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం పచ్చటి పంట పొలాలను త్యజించిన రైతులకు అండగా ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు ముందుకు వస్తున్నాయి. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. జయరాం కోమటి’ పిలుపునకు స్పంధించి ఈ సంస్థకు అమెరికా లోని, నెబ్రాస్కా రాష్టం ఓమహా సిటీ ప్రవాసాంధ్రులు రూ. 5 లక్షలు విరాళమిచ్చారు. ఓమహా సిటీ ప్రవాసులు ప్రదీప్ సోమవరపు, ప్రసాద్ కొల్లి, విజయ్ ఆధ్వర్యంలో ఓమహా సిటీకి చెందిన పలువురు ప్రవాసాంధ్రులు రూ. 5 లక్షలు సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందచేశారు. తమకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులకు అమరావతి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు.