• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బోస్టన్ లో ఘనంగా ‘ఎన్టీఆర్’ శత జయంతి ఉత్సవాలు!

admin by admin
May 24, 2023
in Uncategorized
0
0
SHARES
320
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

శ్రీ బోళ్ల గారి ప్రోత్సాహంతో, బోస్టన్ ప్రెసిడెంట్ అంకినీడు చౌదరి రావి, న్యూ హాంప్షైర్ ప్రెసిడెంట్ అనిల్ పొట్లూరి చొరవతో, బోస్టన్ లో శత వసంతాల సార్వభౌమునికి నిత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది.

సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు అన్నారు.

బోస్టన్ మహానగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి కాళిదాసు సూరపనేని అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఎన్టీఆర్ కే దక్కుతుంది.

ఆయన ద్వారానే బడుగు, బలహీనవర్గాలకు నిజమైన రాజ్యాధికారం లభించింది.

పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లను కల్పించారు.

మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.

స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… . రాజకీయ, సినీరంగంపైనే కాదు.. యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకం.

సినీ ప్రపంచంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు.

హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయన సొంతం.

అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారన్నారు.

తెలుగు ప్రజలతో మమేకమై విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుని రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవం తెచ్చారు.

తెలుగుజాతి చరిత్ర సుసంపన్నం చేసిన మహనీయుడని కొనియాడారు.

యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వీడియో కాల్ ద్వారా పాల్గొని తన సందేశాన్ని వినిపించారు.

ఈ కార్యక్రమంలో అనిల్ పొట్లూరి, రావి అంకినీడు చౌదరి, శ్రీనివాస్ గొంది, సూర్య తేలప్రోలు, శశికాంత్ వల్లేపల్లి, శ్రీనివాస్ బొల్లా, సురేష్ దగ్గుబాటి, శ్రీకాంత్ చేబ్రోలు, సురేష్ కమ్మ, శివ దొగిపర్తి, చంద్ర వల్లూరుపల్లి, కోటేశ్వరరావు కందుకూరి, గోపి నెక్కలపూడి, మనోజ్ ఇరువూరి, అరుణ్ వెల్లంకి, కేపీ సోంపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ, కృష్ణ మణికొండ, సందీప్ అల్లూరి, బాలాజి బొమ్మిశెట్టి, సురేష్ దోనెపూడి, మోహన్ నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు.

అనంతరం ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంపై క్విజ్ పోటీలు, ఎన్టీఆర్ వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగింది.

వీటితో పాటు మా ఆ “నంద” తారకం నృత్య నాటక సంగీత కళాంజలి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాత రోజుల ఫ్యాషన్ వాక్, ఎన్టీఆర్ పాటలు, డ్యాన్సులతో చేసిన సందడి చేశారు.

ఆయా కార్యక్రమాలు ప్రసాంధ్రులను బాగా ఆకట్టుకున్నాయి.

అనంతరం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ గారి అమృత భోజనం అందరూ ఆరగించారు.

సాంస్కృతిక కార్యక్రమాలను మనోజ్ ఇరువూరి, దీప్తి నెక్కలపూడి, శైలజ చౌదరి ఇడుపుగంటి సమన్వయపరిచారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారితో పనిచేసిన గురవయ్య పమిడిముక్కల గారు పాల్గొని, ఆయన అనుభవాలను పాలుపంచుకున్నారు.

బాబురావు పోలవరపు మరియు శ్రీనివాస్ గొంది గారి పిలుపు మేరకు, ఆ శకపురుషుని ఆశయాన్ని కొనసాగించుటకు, కొంత మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తామని చెప్పారు.

కాళిదాసు సూరపనేని మరియు శ్రీనివాస్ గొంది గారి పిలుపు మేరకు, ఆ శకపురుషుని ఆశయాన్ని కొనసాగించుటకు, కొంత మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తామని పది నిమిషాల్లోనే $60,000 వరకు తమ తమ విరాళాన్ని ప్రకటించి సభా ప్రాంగణం లో వున్న మిగిలిన వారందరికీ ప్రేరణ ఇచ్చారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చినా సమయాభావం వలన మరొకమారుకు వాయిదా వేశారు.

శకపురుషుని ఆశయాన్ని కొనసాగించుటకు ముందుకు వచ్చిన దాతల వివరములు (ప్రస్తుతానికి)

బాబురావు పోలవరపు – $250
శ్రీ బోళ్ల – $5000
అంకినీడు చౌదరి రావి – $5000
అనిల్ పొట్లూరి – $5000
శ్రీనివాస్ గొంది – $5000
శశికాంత్ వల్లేపల్లి – $5000
సూర్య తేలప్రోలు – $5000
అరుణ్ వెల్లంకి – $5000
కృష్ణ మానికొండ – $5000
గోపి నెక్కలపూడి – $2500
కోటేశ్వరరావు కందుకూరి – $2000
కాళిదాస్ సూరపనేని – $1116
చంద్ర వల్లూరుపల్లి – $1116
సురేష్ దగ్గుబాటి – $1116
సురేష్ దోనేపూడి – $1116
సందీప్ అల్లూరి – $1116
శివరాం పోపూరి – $1116
త్రిబువన్ పరుపల్లి – $1116
బాలాజీ బొమ్మిశెట్టి – $1116
తిరుమలరావు నల్లని – $1116

శ్రీకాంత్ చేబ్రోలు, సురేష్ కమ్మ, KP సోంపల్లి  తదితరులు తమవంతు సాయం చేస్తామని మాట ఇచ్చారు.

Tags: nri tdp bostonntr
Previous Post

వాషింగ్టన్ డీసీలో అత్యంత ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

Next Post

వామ్మో సజ్జల.. ఆయన ఒక్కడు చాలు జగన్ ను ముంచడానికి?

Related Posts

Trending

మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై మారణహోమం.. చంద్రబాబు ఫైర్

August 30, 2023
Uncategorized

TANA Conference-మొదలైన ‘తానా’ 23వ మహాసభల సందడి…చిత్రకు ఘనస్వాగతం

July 4, 2023
Top Stories

పెద్ద సాహసమే: మళ్లీ ఆ తలుపులు తీయించిన సిద్ధరామయ్య

June 26, 2023
Uncategorized

చంద్రబాబూ!..జాగ్రత్త..!!

June 22, 2023
Uncategorized

రామోజీ అంటే జగన్ కి ఎందుకంత భయం?

June 10, 2023
NRI

బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!

May 28, 2023
Load More
Next Post
sajjala ramakrishna reddy

వామ్మో సజ్జల.. ఆయన ఒక్కడు చాలు జగన్ ను ముంచడానికి?

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra