క్యాన్సర్ బాధితుడికి ఎన్ఆర్ఐ టిడిపి యూఎస్ఏ సహాయం

NRI
నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గొర్లి మోహన రావు కుమారుడు గొర్లి అరవింద్ గౌరి నాయుడు గత కొద్ది కాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.మెరుగైన వైద్యం కోసం బాధితుడు గొర్లి అరవింద్ కు ఎన్ఆర్ఐ టిడిపి యూఎస్ఏ కార్యకర్తలకు మేము సైతం అంటూ ముందుకొచ్చి ఇచ్చిన రెండు లక్షల రూపాయలు చెక్ ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతుల మీదుగా గొర్లి మోహన రావు గారికి ఇవ్వడం జరిగింది.ఎంతో సహృదయంతో కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మేమున్నమంటూ ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐ టిడిపి యూఎస్ఏ కార్యకర్తలకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు.మోహన రావు కుటుంబానికి అన్నివిధాలా పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.కష్టంలో ఉన్న కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.