ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో బాటు, రాబోయే జమిలి ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే దిశగా, ఇప్పట్నుంచి అడుగులు వేయాలని యన్ ఆర్ ఐ తెలుగుదేశం కువైట్, గల్ఫ్ లో వుంటున్న యన్. ఆర్. ఐ. లతో బలమైన క్యాడర్‌ను తయారు చేసేందుకు వ్యూహాలు రెడీ చేసింది . తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు డిసెంబర్ 25, 2020” నుండి పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం తో స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించబోతున్నాము. సభ్యత్వ నమోదుతోపాటు “ప్రవాస భీమా” పై అవగాహన కల్పిస్తూ, భీమా నమోదు కూడా చేయించే దిశగా వెళుతున్నాము.
నాయకులు వారి అబిప్రాయాలు..
పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలి విడత కోవిడ్ నిబందనలకణుగుణంగా కొన్ని ప్రాంతాలలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతంగా చేయగలిగాము, మలి విడతలో మిగతా ప్రాంతాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమము కొనసాగిస్తాము, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచేందుకుగాను ప్రత్యేకంగా ఒక టీమును రూపొందించాము. నిజాయితీగల రాజకీయాలతో పటిష్టమైన పౌర సమాజాన్ని నిర్మించేందుకు యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ కట్టుబడి ఉందని “ అధ్యక్షులు వెంకట్ కోడూరి” తన ప్రసంగంలో తెలిపారు.
సభ్యత్వ నమోదుకు సంబందించిన పత్రాలన్నీ పక్కాగా పూర్తి చేసి వివిద విభాగాలకు,అనుబంద సంస్థలకు చేరవేయడం జరిగినది. పార్టీ సభ్యత్వ కార్యక్రమ ఇన్‌చార్జీలతో సమావేశాలు నిర్వహించి, ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ నిభందనలను ఖచ్చితంగా పాటిస్తూ సభ్యత్వ నమోదు కొనసాగిస్తామని, అదేవిదంగా సబ్యుని సమగ్ర వివరాలుంటే పార్టీ అందిస్తున్న భీమా పథకాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తవని . యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ “ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు అక్కిలి” కార్యాచరణ కమిటీకి దిశానిర్దేశం చేశారు.
పార్టీని కొత్త రక్తంతో నింపాలని, కొత్త వారికి ఆహ్వానం పలకాలని యన్ ఆర్ ఐ తెలుగుదేశం కువైట్ భావిస్తూ అందుకు తగ్గట్టుగా పటిష్ట కార్యాచరణ కమిటీని తయారు చేస్తుంది. దేశంలో ఏ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతం. , కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెదేపా కనుక సభ్యత్వాలు రికార్డు స్థాయిలో వేగవంతం చేసి పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని “ బలరామ్ నాయుడు” తెలియచేసారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, చాలా మంది నాయకులు పార్టీని వదలి పోయి , సంక్షోభాలు, కుట్రలు చేశారు, కొంత మంది తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తాం, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ కూడా వుండనీయం, చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు అంటూ తెలుగుదేశం పార్టీ లో అన్నీ పదవులు అనుభవించి, సంతలో పశువుల్లాగా అమ్ముడుబోయి గతాన్ని మరిచిన గజినీలు అని మీకు తెలియ చేస్తూ రాష్ట్రాభివృధ్ధి కోరేవారందరూ పార్టీ అభిమానులందరూ సభ్యులుగా చేరి చంద్రన్నకు అండగా నిలబడాలని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ “మైనారటి విభాగం ఆధ్యక్షులు షేక్ రహమతుల్లా” పిలుపునిచ్చారు.
అదేవిధంగా వివిద విభాగాల అద్యక్షులు మాట్లాడుతూ :
వెనుకబడిన తరగతులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ ముందు వరసలో నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా చెప్పుకునేందుకు గర్విస్తున్నాం. కుల వృత్తులను నమ్ముకున్నవారికి ‘ఆదరణ ‘ వంటి పథకాల ద్వారా బాసటగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ “ బి సి ఆధ్యక్షులు రాము యాదవ్” తెలియచేసారు .
పార్టీకి కార్యకర్తలే పట్టు గొమ్మలని. పార్టీలో చేరిన వారికి తప్పనిసరిగా ఆదరణ ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అని “ యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ “ తెలుగు యువత ఆధ్యక్షులు మల్లికార్జున నాయుడు తన ప్రసంగంలో తెలియచేసారు .
ఈ నమోదు కార్యక్రమంలో సహకరించిన ముఖ్యనాయకులు, పొత్తూరు పార్థసారది, రఘునాథ్ చౌదరి, మోహన్ రాచూరి, షేక్ యం డి. అర్షద్, భాస్కర్ నాయుడు మల్లరపు, ముస్తాక్ ఖాన్, రమేశ్ కొల్లరపు, కరీం టి, బాబా సాహెబ్, కదీర్ బాషా, శంకరయ్య నాయుడు , బొమ్ము నరసింహులు (సింహా), చంద్రా గౌడ్, పాల్గొని తమకు పదవుల కంటే పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉండడమే ముఖ్యమని తెలిపారు.