NRI తెలుగు దేశం కువైట్-అన్ని వర్గాల సమావేశం

NRI
కువైట్ లో ఉన్న తెలుగు దేశం పార్టీ అభిమానులను , సానుబూతి పరులను,కార్యకర్తలను, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే తటస్థులను, బడుగు బలహీన, దళిత మైనరటి వర్గాల నాయకులను, అందర్నీ ఒక వేదికగా చేసుకుని పటిష్టమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనీ అధిష్టానం అనుమతితో అన్ని వర్గాలను కలిపి NRIతెలుగు దేశం కువైట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించేలా  ఏర్పాటు చేయటం జరిగింది .
విభిన్న వర్గాలు అందరు కలిసి NRI తెలుగు దేశం వేదికగా కార్యవర్గ నిర్మాణం చేయటం జరిగింది. నూతన అధ్యక్షులుగా వెంకట్ కోడూరి, ప్రధాన కార్యదర్శిగా నాగేంద్ర బాబు అక్కిలి,  ఫైనాన్స్ సలహాదారులుగా సాయి సుబ్బారావు, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా రెహమతుల్లా, బి సి విభాగం అధ్యక్షులుగా రాము యాదవ్, తెలుగు యువత విభాగం అధ్యక్షులుగా మల్లిఖార్జున నాయుడు లను ఎన్నుకోవటం జరిగింది. NTR సేవాదళ్, MRPS అనుబంధ సంస్థలుగా కొనసాగుతాయి.
తెలుగుదేశం పార్టీ చేసిన అబివృద్ది అటు తెలంగాణాలో  ఇటు ఆంధ్రప్రదేశ్ లో,  ఇలా   టిడిపి హయం లో,  బాబు గారి హయం లో,  చేసిన అభివృద్ధి గురించి, స్థాపించిన సంస్థల గురించి, కల్పించిన ఉద్యోగాల గురించి, సృష్టించిన సంపద గురించి, పెరిగిన జీవన ప్రమాణాలు గురించి, విస్తృతమైన నగర పరిణామం గురించి,  వారికి తెలియచేసి, ఇంతకన్నా ఎక్కువ చేసిన వారు ఎవరైనా వున్నా...చెప్పండి, అని వారిని అడగడం జరిగినది, లేదు, కాదు , ఇది జరగలేదు అని చెప్పే ధైర్యం ఎవరికి వున్నా...సరే.. చర్చకు మేము (యన్ ఆర్ ఐ తెలుగుదేశం కువైట్ ) సవాల్ విసురుతున్నాము అని బలరామ్ నాయుడు వారికి వివరించండం జరిగినది.
• పార్టీ బలోపేతానికి అందరం సమిష్టిగా కృషి చేస్తున్నాము, ఇందుకోసం కొత్తగా పార్టీలో చేరికలు వున్నాయి,  రాబోయే రోజులలో ఎక్కువగా వుంటాయి. ఇలాంటి పరిణామాలు పార్టీని బలోపేతం చేయడానికి కాబట్టి అందరం సర్దుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా వుంది, అలాగని ముందుగా కష్టపడి పని చేసిన వారికి అన్యాయం జరగదు. వారికి మంచి గౌరవం ఉంటుంది. ఎవరైతే కొత్తవారు పార్టీకి ఉపయోగ పడేవారు వుంటారు కాబట్టి ఆలోచిస్తాము అని వెంకట్ కోడూరి అన్నారు ,
• ఎవరైతే క్రమశిక్షణతో, దీక్షతో కార్యకర్త అనే మొదటి మెట్టు ఎక్కి, అందులో రాటుదేలిన వాడే రాజకీయాలలో మిగతా మెట్లు అధిరోహించ అవకాశం వుంటుంది, అలాంటి వాడే దీర్ఘకాలం ప్రజలలో నిలవగలడు... ఆ కార్యకర్త పాత్ర, విలువ, తెలిసిన వాడే నాయకుడు...... ప్రజానాయకుడు. కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడి, ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని,  వారకి నిత్యం అందుబాటులో వుండి, పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి,  దాన్ని ఓటు రూపంలో మార్చి , ‘తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చి , పార్టీ ప్రజా ప్రతినిధులుగా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసమే, శ్రమిస్తూ, ముందూకు పోవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తపై వుంది అని నాగేంద్ర బాబు అక్కిలి తన ప్రసంగంలో తెలియచేసారు  ..
• గుండెను జెండాగా చేసి, తమ గుండెలే కవచాలుగా రాజకీయ గుండాల దౌర్జ్యన్యాలను  ఎదురొడ్డి, తెలుగుదేశం  జెండాను రెపరెపలాడిస్తున్న  గణత కార్యకర్తలదే ... ! ప్రతీ కార్యకర్త తాను కూడా ఒక అభ్యర్ధిగానే భావించి పార్టీ విజయానికి , అభ్యర్ధుల విజయానికి అలుపెరగని సైనికులు  లాగా పని చేస్తే ప్రతి సారి జరిగే ఎన్నికలలో TDPని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు, అయితే వారిలో చైతన్యం నింపి పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని అదే  షేక్ రహమతుల్లా తెలియచేసారు .
ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాష , కే‌కే చౌదరి , సౌదీ నుండి రాధాకృష్ణ, దుబాయి నుండి ముక్కు తులసి కుమార్ , రఘునాథ్ చౌదరి ,  మాజీ ఎగ్జిక్యూటివ్ కౌన్సెల్ మెంబెర్స్ సుబ్బారాయుడు, మొహమ్మద్ బొర్రా మరియు సురేష్, సాయీ సుబ్బారావు ,,పార్థసారధి   ఉదయ్ ప్రకాష్, శ్రీనివాస చౌదరి, గోపాల్ రాజు , ముస్తాక్ ఖాన్, రాము యాదవ్, కరీం టి, మోహన్ రాచూరి, షేక్ యం డి. అర్షద్, భాస్కర్ నాయుడు మల్లరపు, మల్లికార్జున నాయుడు, బాష, బాబా సాహెబ్, కదీర్ బాషా, శంకరయ్య నాయుడు , బొమ్ము నరసింహులు (సింహా),  చంద్రా గౌడ్,  పాల్గొని తమకు పదవుల కంటే పార్టీ అధికారంలోకి తిరిగి రావడం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉండడమే ముఖ్యమని తెలిపారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.