ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న అవకాశం వాకిట్లో నిలబడి ఉంది. రిటర్న్ గిఫ్ట్ ఆకర్షణీయమైన ప్యాకింగులో సిద్ధంగా ఉంది. మన విముక్తి కోసం, విమోచన కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం, ఆత్మ గౌరవం కోసం,మానవ హక్కుల కోసం నవంబర్ 30 రారమ్మని పిలుస్తోంది. సీమాంధ్రులంతా ఇప్పటికే డిసైడయిపోయారు. గంప గుత్తగా, ఒక బ్లాక్ వోట్ గా కాంగ్రెస్ కు వోటెయ్యడానికి డిసైడ్ అయిపోయారు. ఇందులో కులాలు, పార్టీల ప్రసక్తి లేదు.
కమ్మోళ్ళందరూ అరికపూడి గాంధీని, మాగంటి గోపినాథ్ ని, నల్లమోతు భాస్కర్ రావు ని కాదని ఒక జగదీశ్వర్ గౌడ్ ని, ఒక అజారుద్దీన్ ని, ఒక లక్ష్మా రెడ్డి ని ఓటేసి, ప్రచారం చేసి గెలిపిస్తుంటే, రేవంత్ రెడ్డి, సీతక్కల నాయకత్వాన్ని వానర సైన్యంలా బలపరుస్తుంటే, దానిలో కులమెక్కడుంది ?
ఎవరూ అడక్కుండానే కాంగ్రెస్ ర్యాలీల్లో తెలుగు దేశం జండాలు కట్టుకుని పాల్గొంటుంటే, తెలుగు దేశం పార్టీ కి ఆంధ్ర ప్రాదేశికత్వం అంటకట్టే అవకాశమేది ?
నేటి కఠిన వాస్తవమేమిటంటే, చివరికి చంద్రబాబే వచ్చి తెరాసకో, భాజపాకో వోటేయమన్నా, ఒక్క సీమాంధ్రుడు గానీ, ఒక్క కమ్మోడు గానీ, ఒక్క తెలుగు దేశం అభిమాని గానీ, చివరకు ఒక్క చంద్రబాబు అభిమాని కూడా అయన మాట వినడు.
కాంగ్రెస్ కి వోటేయక మానడు .
కెసిఆర్ ఏమిటో, బీజేపీ ఏమిటో ఎప్పుడో తెలియక కాదు కానీ, ఇన్నాళ్లకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల ఓట్లను అందుకునే స్థాయికి ఎదిగింది .
అదికూడా రేవంత్ నాయకత్వం కాబట్టి, దానికి రాహుల్ గాంధీ సున్నితత్వం , నిజాయితీ , హ్యూమన్ ఫేస్ , చంద్రబాబు పట్ల తనకున్న గౌరవం తోడయ్యాయి .
ప్రస్తుతానికి సీమాంధ్రుల ఈ నిర్ణయం పూర్తిగా సమర్ధనీయం .
తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు కెసిఆర్, బీజేపీ లను బొంద పెట్టడానికి సిద్ధమైంది .
సీమాంధ్రుల మనోగతం కూడా అదే పంధాలో పయనించడం శుభ పరిణామం.
దీర్ఘ కాలంలో సీమాంధ్రుల రాజకీయ పయనం మొత్తం తెలంగాణ సమాజంతో సమాంతరంగా సాగడానికి ఇది నాంది .
ఇంకోటి, దీర్ఘ కాలంలో సీమాంధ్రుల బ్లాక్ వోట్ రేవంత్, సీతక్కలకు ఒక నమ్మకమైన వోట్ బ్యాంకు గా తయారవుతుంది .
కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికీ తనదంటూ వోట్ బ్యాంకు లేదు .
అలా వ్యక్తిగత వోట్ బ్యాంకు కలిగిన చివరి నాయకుడు చెన్నా రెడ్డి.
ఆ తరం అంతరించింది .
ఇక మీదట రేవంత్, సీతక్క టీం సీమాంధ్రులకు ఆలంబనగా, సీమాంధ్రులేమో రేవంత్, సీతక్కలకు ఒక వోట్ బ్యాంకు గా ఉండాలంటే దానికి నవంబర్ ౩౦ న ఆరంభోత్సవం జరగాలి .
నవ్వాపుకోలేకపోయిన కేటీఆర్ కు, విప్రో జుంక్షన్లో పోలీసుల దమనకాండకు, మర్నాడు టెకీల కంపెనీ యాజమాన్యాలకు పోలీసులు పంపిన తాఖీదులకు, చేసిన అరెస్టులు, లాఠీ ఛార్జీలకు, పెట్టిన కేసులకు, మెట్రోలో నల్ల చొక్కాలతో ప్రయాణిస్తేనే బొక్కలిరగ దీసిన దొరతనపు దౌష్ట్యాలకు, ఓ ఆర్ ఆర్ మీద పోలీసుల భీభత్సానికి, సంధ్యా కన్వెన్షన్లో ఇండోర్ మీటింగుకి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఏడిపించినదానికి, గచ్చి బౌలి బాలయోగి స్టేడియంలో పర్మిషన్ కోసం హై కోర్ట్ చుట్టూ తిప్పినదానికి, ఇక్కడీ నాటకాలేమిటి, కావాలంటే రాజమండ్రి వెళ్లి చేసుకోండి అన్న కేటీఆర్ అహానికి, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల ఉడత ఊపుగాళ్ళకి, నిఖార్సైన రిటర్న్ గిఫ్ట్ నవంబర్ ౩౦ నాడివ్వండి .
గత కొన్ని దశాబ్దాలుగా కోల్పోయిన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందుదాం .
మనకు తెలియకుండానే మనం కూరుకుపోయిన బానిసత్వం నుండి బయటపడదాం.
డిసెంబర్ మూడున విముక్తి పండగ చేసుకుందాం.