జగన్ అధికారంలోకి రావాలని కోరిన వారు
జగన్ అధికారంలోకి రావడానికి అవసరమైన నిధులు సమకూర్చిన కాంట్రాక్టర్లు
ఇపుడు ఏమంటున్నారు తెలుసా…
గవర్నమెంటు కాంట్రాక్టులు ఇస్తామన్నా కూడా తీసుకోవడం లేదట.
ఇది నమ్యశక్యంగా లేదు కదా… కానీ నిజం
రాయలసీమ జిల్లాలకు అత్యంత ప్రధానమైన హంద్రీనీవా పనులు గత 28 నెలలుగా నిలిచిపోయాయి.
పనులు చేయండి అని కాంట్రాక్టర్లను పిలుస్తుంటే ఎవరూ రావడం లేదట.
ఈ విషయాన్ని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ బయటపెట్టారు.
టీడీపీ హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల ద్వారా చివరి ప్రాంతం వరకు నీటిని అందించామని, ఇపుడు సాగునీటి పనులు ఏ ప్రాజెక్టులోను జరగడం లేదన్నారు. పోలవరాన్ని పడుకోబెట్టేశారని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోయాయని దేవినేని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దివాలా తీయడం వల్ల, ఇప్పటివరకు పనులు చేసిన కాంట్రాక్టర్లు ఎవరికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే… ప్రభుత్వ పనులు అంటేనే కాంట్రాక్టర్లు జడుచుకుంటున్నారని అన్నారు.
తన చేతకాని తనంతో జగన్ రైతులను నిండా ముంచారన్నారు.