• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భూముల కొనడం నేరమా?

మోసం ఎలా అవుతుంది? II రాజధాని అమరావతిలో ఎక్కడుంది రహస్యం!? II ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దీనికి వర్తించదు

admin by admin
March 19, 2021
in Andhra, India, Politics, Top Stories, Trending
0
no scam in amaravati
0
SHARES
87
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి  సీఎం జగన్‌ అండ్‌ కోట ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల బండారాన్ని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టే బట్టబయలు చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ వాదన వట్టిదేనని తేల్చేసింది. రాజధాని నిర్ణయంలో రహస్యమేదీ లేదని స్పష్టం చేసింది. ఎక్కడ రాజధాని వస్తోందో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తూనే ఉందని మీడియా కథనాలు ప్రచురితమైన తేదీలతో సహా వెల్లడించింది.

ఆస్తులు సమకూర్చుకోవడం పౌరుల హక్కని, అది నేరం, మోసం ఎలా అవుతుందని నిలదీసింది. ‘అమ్మిన తర్వాత భూముల ధర పెరిగింది’ అంటూ కొనుగోలుదారులపై కేసులు పెట్టడం ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని హెచ్చరించింది. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ ద్వారా భూములు కొన్నారంటూ వివిధ సెక్షన్ల కింద ఆరుగురిపై సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేస్తూ ఈ తీర్పు వెలువరించింది.

భూములు కొనుగోలు చేసినవారిని ప్రాసిక్యూట్‌ చేయడానికి, భూలావాదేవీలకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపచేయడానికి వీల్లేదని తెగేసిచెప్పింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో జరిగే ఈ మోసాన్ని భూలావాదేవీలకు అంటగట్టేందుకు జగన్‌ ఈ వంచన ప్రక్రియను, పదబంధాన్ని ఎంచుకున్నారని ఈతీర్పుతో తేలిపోయింది.

కేసు కుట్ర ఇదీ..

రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకుని, అమరావతి చుట్టుప్రక్కల కొంతమంది భూములు కొనుగోలు చేశారని వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్‌ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిని ఆధారంగా చేసుకుని నార్త్‌ ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరె క్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరావు, సీహెచ్‌ తేజస్వీ, లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వెర్టెక్స్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గాయత్రి రియల్టర్స్‌, గుడ్‌ లైఫ్‌ ఎస్టేట్స్‌, కిలారు రాజేశ్‌, కె.శ్రీహాస తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం న్యాయస్థానం 87 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది.

కొనుగోలుదారులపై కేసులు డేంజర్‌!

‘భూమి కొన్న తర్వాత దాని విలువ పెరిగింది’… అంటూ కొనుగోలుదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం అత్యంత ప్రమాదకర ధోరణికి తెరలేపినట్లే. తాము అమ్మిన భూమి ధర భారీగా పెరిగితే… కొనుగోలుదారులను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ కేసులో పిటిషనర్లను ఏదో ఒకరకంగా ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఒక గుడ్డి ప్రయత్నం జరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఊహాజనితమైన కారణాలతో  ప్రభుత్వం చేపట్టిన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌. నేరం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లోనే చెప్పలేకపోయారు.

దర్యాప్తులోనూ ఈ విషయం తేలలేదు. హరియాణా  రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ కేసుకు కూడా వర్తిస్తాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పిటిషనర్లపై కేసు పెట్టడం చెల్లదు’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటుకు  సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో వస్తూనే ఉన్నాయని.. ఇది కేవలం కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన ‘రహస్య సమాచారం’ కాదని పేర్కొంది.

ముఖ్యమంత్రిగా చందబ్రాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాజధాని ప్రాంతం గురించిన ప్రకటన వెలువడిందని.. ందువల్ల… పిటిషనర్లు మరేదో మార్గంలో ఈ సమాచారం పొందారని, భూవిక్రేతలకు రాజధానికి సంబంధించిన సమాచారం తెలియదని ఎంతమాత్రం భావించలేమని తేల్చిచెప్పింది. ‘పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు.

ఈ కథనాలను ‘ప్రాసిక్యూషన్‌’ కూడా తోసిపుచ్చలేదు. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం రహస్యం కాదని… ప్రజలకు తెలుస్తూనే ఉందనేందుకు ఇవి తిరుగులేని ఆధారాలు. అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన ప్రకారమే… 2014 సెప్టెంబరు 1వ తేదీన రాజధాని ప్రాంతంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజునే అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ఈ వివరాలు మొత్తం మీడియాలో వచ్చాయి.

రాజధాని ప్రాంతంలో పిటిషనర్లు మాత్రమే  కాదు… అనేక మంది భూములు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారి అందించిన సమాచారంలోనే స్పష్టంగా ఉంది’ అని గుర్తుచేసింది. కంపెనీల అంతర్గత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వాటి షేర్లు, బాండ్ల ‘ట్రేడింగ్‌’ చేయడం చట్ట విరుద్ధం. దీనినే  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు.

ఇది పూర్తిగా కంపెనీలు, షేర్‌ మార్కెట్లకు సంబంధించిన విషయం. భూములు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు దీంతో సంబంధమే లేదు. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో ఐపీసీ నిబంధనలకు సంబంధమే లేదు. పిటిషనర్లకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వర్తింపజేయడం తప్పు’ అని హైకోర్టు ఆక్షేపించింది.

ఆస్తి… అందరి హక్కు

‘ఆస్తి హక్కు రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఇది చట్టబద్ధమైన హక్కు.  దీని ప్రకారం దేశంలోని పౌరులు ఎవరైనా, ఎక్కడైనా భూములను కొనుగోలు చేయవచ్చు. ఆస్తులు సమకూర్చుకోవడం నేరం కానేకాదు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారంటూ క్రిమినల్‌ లా కింద చర్యలు తీసుకోలేరు’ అని న్యాయస్థాని తేల్చిచెప్పింది. ప్రైవేటు భూలావాదేవీలు ఎలా నేరపూరితమవుతాయో… భూమిని కొన్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుని, వారిని ప్రాసిక్యూట్‌ చేయడం ఏమిటో కోర్టు అవగాహనకు అందడంలేదని వ్యాఖ్యానించింది.

‘‘కృష్ణా-గుంటూరు జిల్లా పరిధిలో… కృష్ణా నదీ తీరం వెంబడి రాజధాని వస్తుందనే విషయాన్ని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుసుకున్నారు. 2014 జూన్‌ – డిసెంబరు మధ్య భూములు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని రాజధాని ప్రాంతంలో, మరికొన్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అవతల ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని వస్తోందనే విషయాన్ని రైతుల వద్ద దాచిపెట్టి మోసం చేశారు’’ అని పిటిషనర్లపై కేసు పెట్టారు. కానీ… రాజధాని విషయంలో రహస్యమే లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎప్పటికప్పుడు ప్రజలందరికీ  దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తూనే  ఉందంటూ పత్రికా కథనాలను ప్రస్తావించింది. ‘2014 జూన్‌ 9న ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే… కృష్ణా-గుంటూరు జిల్లాల్లో, కృష్ణా నదీ తీరం వెంబడి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయం అన్ని ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది.

2014 జూన్‌ 10న.. రాష్ట్రానికి భౌగోళికంగా నడిమధ్యలో, అందరికీ సమాన  దూరంలో ఉన్నందునే విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని వివిధ పత్రికలు ప్రచురించాయు. కొత్త రాజధానికి సరైన ప్రాంతం కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యనే అని, అక్కడే రాజధాని వస్తుందని సలహా కమిటీ అధ్యక్షుడు (నాటి మంత్రి) పి.నారాయణ ప్రకటించారు.

ఢిల్లీలో శివరామకృష్ణన్‌ కమిటీని కలిసి ఈ విషయం వెల్లడించారని ‘సాక్షి’ పత్రిక కూడా ప్రచురించింది. 2014 సెప్టెంబరు 24న కొత్త రాజధాని చుట్టూ ఒక రింగ్‌ రోడ్డు వస్తుంది.  రాజధానికి 30వేల ఎకరాలు అవసరమవుతాయని ఈనాడు ప్రచురించింది. ఇదే కథనంలో ‘పుత్రజయ’ నగర చిత్రాన్ని కూడా ప్రచురించారు. 2014 అక్టోబరు 30న ఆంధ్రజ్యోతిలో.. తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధాని వస్తుంది.

భూసమీకరణ విధానంలో రైతుల నుంచి 30వేల ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రచురితమైంది. అదే రోజు ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక.. ‘రాజధానిపై కొన్ని నెలలుగా ఉన్న సస్పెన్స్‌కు  తెరపడింది.ఆంధ్రపద్రేశ్‌కు ‘రివర్‌ ఫ్రంట్‌’ రాజధాని రానుంది. కృష్ణా నదికి దక్షిణాన గుంటూరు జిల్లాలోని 17 గ్రామాల పరిధిలో రాజధాని వస్తుందని తెలిపింది. ఆయా గ్రామాల పేర్లు కూడా ప్రచురించింది’ అని కోర్టు తన తీర్పులో తెలియజేసింది.

ఏ సెక్షన్‌ ఎందుకు చెల్లదు!

భూములు కొన్నారంటూ సీఐడీ నమోదు చేసిన ఒక్కో సెక్షన్‌ ఎందుకు చెల్లదో కోర్టు వివరంగా చెప్పింది. ‘భూమిని ఎందుకు కొంటున్నాం, కొన్న తర్వాత ఏం చేస్తాం అనేది విక్రయదారుడికి చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ నేపథ్యంలో పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు దాచారని భావించలేం. ఆ లావాదేవీల వల్ల విక్రయదారుడికి జరిగిన నష్టం ఏమీ లేదు. అందువల్ల… దీనిని ఐపీసీ 420 కింద మోసంగా పరిగణించలేం.

పిటిషనర్లకు ఎవరూ భూములు అప్పగించలేదు. వాటి దుర్వినియోగం కూడా జరగలేదు. అందువల్ల సెక్షన్‌ 415 ఐపీసీ వర్తించదు. ఈ కేసులో ‘బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ (విశ్వాస ఘాతుకం) వర్తించదు. 406 ఐపీసీ కింద నేరం జరగలేదు. బ్యాంకర్‌, మర్చంట్‌, పబ్లిక్‌ సర్వెంట్‌ లేదా ఏజెంట్‌లు తమకు అప్పగించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తే ఐపీసీ 409 సెక్షన్‌ వర్తిస్తుంది. ఇక్కడ భూములు కొన్న వారు వీరెవరూ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన చట్టబద్ధమైన ఒప్పందంలో నేరపూరిత కుట్ర ఏముంది? 120-బి ఐపీసీ (నేరపూరిత కుట్ర) వర్తించదు’ అని స్పష్టం చేసింది.

‘భూములు అమ్మి మేం నష్టపోయామని వాటి యజమానులెవరూ ఇన్ని రోజుల్లో ఎవరూ చెప్పలేదు. ‘ఇక్కడ రాజధాని వస్తుంది’ అనే సమాచారం దాచిపెట్టి భూములు కొన్నారని ఫిర్యాదు చేయలేదు. అమ్మిన వాళ్లూ, కొన్నవాళ్లూ ఒక చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. పిటిషనర్లు తమ కుటుంబ, వ్యాపార అవసరాల కోసం భూములు కొన్నారు. నిజంగా తమకు నష్టం జరిగిందని భావిస్తే… ఆరేళ్ల క్రితమే తాము మోసపోయామని కేసులు పెట్టేవారు.

ఇప్పుడు… ఇన్నేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్‌ వారు చూపిస్తున్న  విక్రేతల వాంగ్మూలాలను వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే… ‘మా భూములు అమ్ముతాం’ అని విక్రేతలే స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ లావాదేవీలతో ఏమాత్రం సంబంధంలేని, మూడో వ్యక్తి ఎవరో దీనిపై ఫిర్యాదు చేశారు’ అని హైకోర్టు గుర్తుచేసింది.

ఈ తీర్పుతో వైసీపీ పెద్దల నోళ్లు మూతబడ్డాయి. సీఎం నుంచి బూతుల మంత్రుల వరకు ఎవరూ దీనిపై  ఇప్పటివరకు స్పందించలేదు. సీఎం మాత్రం సన్నిహిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయురెడ్డి, సహాయ అడ్వకేట్‌ జనరల్‌ జాస్తి నాగభూషణ్‌తో మంతనాలు జరిపినట్లు తెలిసింది. దీనిపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు గానీ, సుప్రీంకోర్టుకు గానీ వెళ్తే ఎలా ఉంటుందని చర్చించారు.

డివిజన్‌ బెంచ్‌కు వెళ్తే.. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులపై విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం ముందుకే దీనిని పంపే అవకాశముందని.. ఇన్‌సైడర్‌  ట్రేడింగ్‌ అవాస్తవమని ఇప్పటికే కోర్టు తేల్చినందున.. 3 రాజధానుల వాదనలోనూ పస లేదన్న విషయం బయటపడుతుందని కొందరు న్యాయనిపుణులు చెప్పినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు తీర్పునే సమర్థించే అవకాశాలు ఉన్నాయని.. అందుచేత మరికొంత లోతుగా ఆలోచించి అప్పీల్‌పై నిర్ణయం తీసుకుంటే మంచిదని వారు సలహా ఇచ్చినట్లు సమాచారం.

Tags: Amaravatiandhrapradeshinsider trading
Previous Post

బ్రొ… దానివల్ల నా ఫ్యాలిలీలో నేను వెధవనయ్యాను

Next Post

ప్రమాద ఘంటికలు

Related Posts

జనానికి వ్యాక్సిన్ వేయడం భారమా జగన్?
Top Stories

జనానికి వ్యాక్సిన్ వేయడం భారమా జగన్?

April 22, 2021
ఆన్ లైన్‌లో ఆక్సిజన్ సిలిండర్లు…ఇళ్లలోనే ఆక్సిజన్ పెట్టుకోవడం ఇలా
Around The World

ఆన్ లైన్‌లో ఆక్సిజన్ సిలిండర్లు…ఇళ్లలోనే ఆక్సిజన్ పెట్టుకోవడం ఇలా

April 22, 2021
మోడీని సుప్రీం..  జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి
Around The World

మోడీని సుప్రీం.. జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి

April 22, 2021
covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి
Andhra

covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి

April 22, 2021
covid: ఏపీలో అరాచకాలు… మీరసలు నమ్మలేరు!!
Andhra

covid: ఏపీలో అరాచకాలు… మీరసలు నమ్మలేరు!!

April 22, 2021
Jagan
Andhra

జగన్ బెయిల్ రద్దు కేసులో లేటెస్ట్ అప్ డేట్

April 22, 2021
Load More
Next Post
ప్రమాద ఘంటికలు

ప్రమాద ఘంటికలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జనానికి వ్యాక్సిన్ వేయడం భారమా జగన్?
  • ఆన్ లైన్‌లో ఆక్సిజన్ సిలిండర్లు…ఇళ్లలోనే ఆక్సిజన్ పెట్టుకోవడం ఇలా
  • మోడీని సుప్రీం.. జ‌గ‌న్‌కు హైకోర్టులు ఉతికారేశాయి
  • covid: జ‌గ‌న‌న్న పాల‌న‌లో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి
  • covid: ఏపీలో అరాచకాలు… మీరసలు నమ్మలేరు!!
  • జగన్ బెయిల్ రద్దు కేసులో లేటెస్ట్ అప్ డేట్
  • క్లీవేజ్ పాప క్లీన్ షో …చూస్తే మతి పోవాల్సిందే
  • covid: యశోదలో కేసీఆర్ ను టెస్టు చేసిన డాక్టర్ ఏమన్నారు?
  • covid: అనూహ్య మైన విషాదం… షాకింగ్
  • covid: కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన కేటీఆర్
  • secret: చంద్రబాబు ఎందుకు అలసిపోడు?
  • ఉన్నవాటికి దిక్కులేదు!
  • Covid: దుమ్ము రేపుతున్న కేసీఆర్ పాత వీడియో !!
  • ‘తానా’ ఎన్నికలలో ఛాలెంజ్ ఫేస్, క్లైమాక్స్ ఎటు మలుపు తిరుగుతుందో?
  • కుప్ప కూలిన ఆరోగ్య వ్యవస్థ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds