ఈ శుక్రవారం థియేటర్స్ లో రెండు తెలుగు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి `మ్యాడ్ స్క్వేర్` కాగా.. మరొకటి `రాబిన్ హుడ్`. రెండు చిత్రాలు మిక్స్ రివ్యూలు సొంతం చేసుకున్నాయి. కానీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మ్యాడ్ బాయ్ ముందు రాబిన్ హుడ్ తేలిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మితమైన రాబిన్ హుడ్ చిత్రంలో యూత్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా నటించారు. వెంకీ కుడుముల దర్శకుడు.
భీష్మ వంటి సూపర్ హిట్ అనంతరం నితిన్, వెంకీ కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది. కథ, కథనంలో కొత్తదనం లేకపోయినా.. డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించుకున్న రాబిన్ హుడ్ ఫస్ట్ డే ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. యూత్ మొత్తం మ్యాడ్ స్క్వేర్ వేపే ఆసక్తి చూపడంతో.. నితిన్ సినిమాను అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. డే1 ఏపీ మరియు తెలంగాణలో రూ. 6.04 కోట్ల షేర్, రూ. 9.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మ్యాడ్ 2 మూవీ.. వరల్డ్‌వైడ్ గా రూ. 10.54 కోట్ల షేర్, రూ. 19.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
రాబిన్ హుడ్ విషయానికి వస్తే.. ఏపీ మరియు తెలంగాణలో ఈ సినిమా కేవలం రూ. 1.61 కోట్ల షేర్, రూ. 3.15 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో రూ. 55 లక్షలతో సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 2.36 కోట్ల షేర్, రూ. 4.80 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ. 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే ఇంకా రూ. 26.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఏదేమైనా సోలో రిలీజ్ అయ్యుంటే రాబిన్ హుడ్ కు బెటర్ కలెక్షన్స్ వచ్చేవి అనడంలో సందేహం లేదు.