మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్ళు` చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం నిహారిక తన హోమ్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో ఒక సినిమాను నిర్మిస్తోంది. ఇందులో `మ్యాడ్` మూవీ తో ఫుల్ పాపులర్ అయిన సంగీత శోభన్ హీరోగా నటిస్తున్నాడు.
మానస శర్మ అనే అమ్మాయి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న నిహారిక ఫ్యూచర్ లో ఒకవేళ టాలీవుడ్ టాప్ హీరోలతో ఛాన్స్ వస్తే ఎటువంటి సినిమాలను నిర్మించాలనుకుంటున్నానో వివరించింది. అవకాశం వస్తే ఏ హీరోతో ఏ జోనర్ ను ట్రై చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లవ్ స్టోరీ నిర్మించాలని ఉందంటూ నిహారిక చెప్పుకొచ్చింది.
అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కామెడీ ఎంటర్టైనర్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథాలజికల్ ఫిల్మ్ ను నిర్మించాలని ఉందంటూ నిహారిక తన మనసులో మాటను బయటపెట్టింది. ఇక డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే మాత్రం తన ఫస్ట్ ఫిల్మ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ఉంటుందని నిహారిక పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.