మెగా ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక.. షార్ట్ ఫిల్మ్స్ లో యాక్టింగ్ మొదలుపెట్టింది. ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారింది. అయితే భారీ సినీ నేపథ్యం ఉన్నప్పటికీ కథానాయకగా నిహారిక అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఈలోపే పెళ్లి, విడాకులు అంటూ కొన్నాళ్ళు యాక్టింగ్ కు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవల మళ్లీ కెరీర్ పై దృష్టి సారించింది. ఓవైపు నటిగా మరోవైపు నిర్మాతగా రాణిస్తోంది.
ప్రస్తుతం నిహారిక తన ప్రొడక్షన్ లో రాబోతున్న `కమిటీ కుర్రోళ్లు` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆగస్టు 9న ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో గత రెండు వారాల నుంచి నిహారిక బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో షార్ట్ ఫిల్మ్స్ ప్రస్తావన రాగా.. తాను గతంలో నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశానన్న విషయానికి నిహారిక బయటపెట్టింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఆ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించాడు. అందులో అఖిల్, నిహారిక జంటగా నటించారు. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలకు నోచుకోలేదు. అందుకు అడ్డుపడింది రాజమౌళినే అట.
ఎందుకంటే, కార్తికేయ డైరెక్ట్ చేసిన ఆ షార్ట్ ఫిల్మ్ రాజమౌళికి అస్సలు నచ్చలేదు. డబ్బులు రాకపోయినా పర్లేదు పరువు పోకూడదు అనే భావనతో రాజమౌళి ఈ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేయకపోతేనే బెటర్ అని కార్తికేయకు సూచించాడట. దాంతో అఖిల్, నిహారిక కలిసి నటించిన ఆ లఘు చిత్రం విడుదల కాకుండానే అటకెక్కింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక స్వయంగా ఈ విషయాన్ని పంచుకుంది.