అందాల భామ నిధి అగర్వాల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. నార్త్ లో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. సౌత్ చిత్రాలతోనే నిధి అగర్వాల్ గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు అత్యంత చేరువైంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `రాజా సాబ్` చిత్రంలో యాక్ట్ చేస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి నటించిన చారిత్రాత్మక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు` పార్ట్ 1 విడుదలకు సిద్ధమైంది.
ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో నిధి అగర్వాల్ తమిళ స్టార్ హీరో శింబు ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. శింబు హీరోగా తెరకెక్కిన `ఈశ్వరన్` మూవీతో నిధి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తమిళ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ విషయంపై నిధి ఓపెన్ అయిపోయింది.
`హరిహర వీరమల్లు` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. శింబోతో ప్రేమ, పెళ్లి వార్తలపై రియాక్ట్ అయ్యింది. `నటీనటుల ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ పైనే అందరూ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. నిజమా? కాదా? అని నిర్ధారించుకోకుండా ఏది అనిపిస్తే అది బయటకు మాట్లాడేస్తారు. ఇదంతా చాలా కామన్. జనాలకు నిజాలు కంటే పుకార్లపైనే ఎక్కువ ఆసక్తి. అందుకే వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పటికప్పుడు అటువంటి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి` అంటూ నిధి చెప్పుకొచ్చింది. మొత్తంగా శింబుతో ప్రేప, పెళ్లి వార్తలను ఈ బ్యూటీ పరోక్షంగా ఖండించింది.