కేరళలోని విలంజియం సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డ ఘటన సంచలనం రేపింది. ఆ కేసులో నిందితుడు ఆదిలింగాన్ని ఎన్ఐఏ అధికారులు విచారణ జరిపారు. తమిళ సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు పీఏగా గతంలో ఆది లింగం పనిచేసిన నేపథ్యంలో ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా చేసిన కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. వరలక్ష్మికి ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఇండస్ట్రీలో ఆది లింగం పెట్టుబడిగా పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో మరింత సమాచారం రాబట్టేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెను విచారణ జరిపితే ఆది లింగం గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారట. ఇక, ఆమెకు ఆది లింగం డ్రగ్స్ సరఫరా చేశాడా లేదా అన్న కోణంలో కూడా విచారణ జరపనున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించింది.
రవితేజ నటించిన క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక, వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య బాబు చెల్లెలి పాత్రలో లేడీ విలన్ గా జయమ్య మార్కులు కొట్టేసింది. మరోవైపు, కేరళలోని కర్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. కెన్యాలోని నైరోబి నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా విమానంలో ఆ ప్రయాణికుడు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అనుమానంతో అతడిని తనిఖీ చేయగా 3.5 కిలోల కొకైన్, 1.3 కిలోల హెరాయిన్ దొరికింది. ఎంత ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కేరళలోకి అంతర్జాతీయ డ్రగ్ స్పెలర్లు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ తరలిస్తున్నారు.