రెండు రోజులపాటు జరిగిన నందమూరి తారకరామారావు గారి జయంతి మరియు మహానాడు
వేడుకలను చంద్రబాబు గారి ముగింపు ఉపన్యాసం తో ముగించారు.వర్తుల్ విధానంలో ముగింపు సమావేశాల్లో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ౩౦ నిముషాలు సమయం కేటాయించినప్పటికీ తెలుగుదేశం అభిమానుల ఉత్సాహం చుసిన బాబుగారు గంటన్నర సమయం కేటాయించి అభిమానుల అడిగిన ప్రశ్నలకు ఏంటో ఓపికతో సమాధానాలు ఇచ్చారు.
చంద్రబాబు గారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెన్నక్కు నెట్టారని,దాన్ని సరిచేసుకోవడానికి అందరు మళ్ళీ కలిసిరావాలని పిలుపునిచ్చారు.ఒక ప్రశ్నకు సమాధానంగా హత్యకు హత్య సమాధానం కాదని ,మనకు సమస్యలు సృష్టించినవారి చట్టబధంగా సమాధానం చెపుదామని సహనంగా ఉండాలని, ప్రజాస్వామ్య యుతంగా సమస్యలను ఎదుర్కోవాలని చూచించారు.
మనం 20 సంవత్సరాలనాడు నాటిన జి-నోమ్ వాలీలో ఇప్పుడు భారత్ బయోటెక్ రూపంలో కరోనా వాక్సిన్ దేశీయంగా తయారుచేస్తుంది.మెడిటెక్ ప్రాజెక్ట్ వైజాక్ లో కంప్లీట్ ఇయుంటే మనమే ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్లు,వెంటిలేటర్స్ అన్నీ తయారు చేసుకొని విదేశాలమీద ఆధారపడకుండా ఎంతోమందిని బతికించుకొనేవాళ్లమని,ఎంతో విదేశీమారక ద్రవ్యం ఆదాచేసుకొనేవాళ్లమని మరియు అనేక మందికి ఉపాధి కల్పించేవాళ్లమని చెప్పారు.
ఆ తరువాత తెలుగుదేశం న్యూజిలాండ్ సభ్యులు చంద్రబాబు గారిని న్యూజిలాండ్ రావలసిందిగా ఆహ్వానించారు.
సమావేశంలో శ్రీనివాస్ కృష్ణమనేని,ఆదిశేషయ్య నల్లపనేని,,జిత్తు నిమ్మగడ్డ,భవాని శంకర్ ఏలూరి తదితరులు ప్రసంగిచారు.
శ్రీకాంత్ అన్నే,సుబ్బారావు నడింపల్లి, విజయ్ వీరపనేని,కృష్ణ చేబ్రోలు ,మమత,ప్రవీణలు ప్రశ్నలతో ముంచెత్తారు.
అనంతరం భారీగా విరాళం ఇచ్చిన ప్రసాద్ ముత్తారెడ్డిగారిని చంద్రబాబుగారు అభినందించారు.