టిల్లు గాని లవర్… రాధిక పాప ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. అది అలాంటి ఇలాంటి ఛాన్స్ కాదు. ఆమె ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ అటు ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఇటు వరుసగా మూడు సినిమాలకు కాల్షీట్లు ఇస్తూ సినిమాల్లోనూ అంతే బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ హరిహర వీరమల్లు , OG సినిమాలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలకు డేట్లు ఇవ్వాలి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు.
ఇక OG సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నేహాశెట్టిని తీసుకున్నారు. ఈ సినిమాలో ఫ్యూజులు ఎగిరిపోయే ఓ మాస్ బీట్ ఉందట. ఈ సాంగ్ కోసం పవన్ పక్కన నేహా శెట్టిని ఎంపిక చేశారు. రెండు రోజుల నుంచి ఈ పాట షూటింగ్ నడుస్తోంది. థాయ్‌లాండ్ లో దీనిని షూట్ చేస్తున్నారు. నేహా కూడా తాను థాయ్‌లాండ్‌లో ఉన్నా.. ఓ షూటింగ్ కోసం వచ్చానని పోస్ట్ పెట్టింది. అయితే తాను OGలో చేస్తున్నానన్న విషయం మాత్రం చెప్పలేదు.
మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఈ పాటలో పవన్ కనిపిస్తాడా, లేదా? అనేది డౌటు. ఒకవేళ పవన్ పార్ట్ ఉంటే, దాన్ని విడిగా షూట్ చేసి, మ్యాచ్ చేసే అవకాశం ఉంది. నిజంగానే టిల్లు గాని పాపగా పాపులర్ అయిన నేహాకు ఇది చాలా మంచి అవకాశం. ఆమెకు బడా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే వస్తున్నాయి. ఇప్పుడు పవన్ పక్కన స్పెషల్ సాంగ్ చేసినా సరే ఆమె క్రేజ్ మామూలుగా ఉండదు.
ఈ స్పెషల్ సాంగ్ మంచి బీట్ తో, రాప్ స్టైల్లో ఉంటుందట. సాంగ్ ఓ రేంజ్లో క్లిక్ అయితే నేహా క్రేజ్‌ను ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే ఆమె ఏకంగా పవర్లో ఉన్న డిప్యూటీ సీఎంతో డ్యాన్సులు వేస్తోంది కదా..!