భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసి లో లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏపీలో ఎన్డీఏ కూటమి వంద శాతం విజయం సాధించబోతోందని, ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పీఠం అధిష్టించబోతున్నారని అన్నారు. ప్రపంచ దేశాలలో భారత ప్రజలు, భారత దేశం కీలకపాత్ర పోషించబోతున్నాయన్నారు.
ఇక, జాతీయ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అది ఒక గౌరవం అని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీతో తమ బంధం కొనసాగుతుందని, మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2014లో తాము కూటమిగా విజయం సాధించామని, ఈసారి కూడా అదే మాదిరిగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొడతారని అన్నారు.
ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు. ఎన్డీయే 400కు పైగా సీట్లు సాధించబోతుందని చెప్తూ, ప్రపంచంలోనే భారతదేశం కీలకపాత్ర పోషించబోతుందన్నారు.#ModiForViksitBharat #NarendraModi #NaraChandrababuNaidu pic.twitter.com/nDTobHFuSH
— Telugu Desam Party (@JaiTDP) May 14, 2024
Yesterday our polling is done, we are sweeping 100% in Andhra Pradesh#CycleisComing #YCPAntham #TDPJSPBJPWinningAP pic.twitter.com/ic6ByLQhEP
— Telugu Desam Party (@JaiTDP) May 14, 2024