నందమూరి నటసింహం, మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబోలో తెరకెక్కుతోన్న #NBK107 చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. అఖండ వంటి ఇండస్ట్రీ హిట్ తో మంచి ఊపుమీదున్న బాలయ్య తర్వాత చిత్రం కావడంతో ఈ చిత్రం కోసం బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య లుక్ తో పాటు ప్రతి అప్డేట్ వైరల్ అయింది.
ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ టీజర్ విడుదల చేశారు. ఫస్ట్ హంట్ పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. తాజాగా ఆ టీజర్ రికార్డు స్థాయిలో కోటి వ్యూస్ దాటి రెండు కోట్ల వ్యూస్ వైపునకు దూసుకుపోతోంది.
యూట్యూబ్ లో ఈ టీజర్ నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉంది.
‘‘మీకు జీ.వో అంటే గవర్నమెంట్ ఆర్డర్…నాకు జీ.వో అంటే గాడ్స్ ఆర్డర్…నేను నరకడం మొదలుబెడితే ఏ ముక్క ఎవరిదో మీ పెళ్లాలు కూడా గుర్తుపట్టలేరు’’అంటూ బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ అదిరిపోయింది. సాల్ట్ అండ్ పెప్పర్ మాస్ లుక్లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ నెవర్ బిఫోర్ అన్నట్లుంది.
ఈ సినిమాలో బాలయ్య హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య సరసన శ్రుతీ హాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించబోతున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేేస్తున్నారు.