క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారిన నటుల్లో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన నవీన్.. జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న తరుణంలో నవీన్ పోలిశెట్టి యూఎస్ లో ఓ భారీ ప్రమాదానికి గురయ్యాడు. కుడి చేతికి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలు మరియు ఇతర శరీర భాగాల్లో సైతం గాయాలు కావడంతో నవీన్ పోలిశెట్టి ఇంటికే పరిమితం అయ్యాడు.
వైద్యుల పర్యవేణలో యాక్సిడెంట్ నుంచి కోలుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇటీవలె తన హెల్త్ అప్డేట్ కూడా ఇచ్చాడు. రికవరీ అనేది చాలా స్లోగా ఉందని..మరికొన్ని నెలల్లో కంబ్యాక్ ఇస్తానని తెలిపాడు. అయితే తాజాగా రైట్ హ్యాండ్‌కి జరిగిన గాయం వల్ల కట్టుతో తాను ఎన్ని కష్టాలు పడుతున్నానో వివరిస్తూ నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పంచుకున్నాడు.
ఒంటి చేత్తో పడుతున్న తిప్పలను నవీన్ ఫన్నీగా వీడియోలో చూపించి అందర్నీ నవ్వించాడు. టీవీలో ఏ ఛానెల్ మార్చినా హీరోలు చేతి గురించే డైలాగులు చెబుతుంటారు. అవి చూసి నవీన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతుంటారు. పోని హాయిగా క్రికెట్ చూద్దామంటే.. అందులో ఎంపైర్ కూడా తన రెండు చేతులూ పైకెత్తి నవీన్ కు విసుగు పుట్టిస్తాడు.
రెండు చేతులతో చప్పట్లు కొట్టలేక చెంపలు వాయించుకోవడం, చేయి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఫ్రెండ్స్ సెటైర్లు వేయడం వంటి కొన్ని ఫన్నీ అంశాలను వీడియోలో చూపించాడు. కుడి చేయికి కట్టు ఉండటం వల్ల ఎడమ చేతితో భోజనం తింటుంటే సంస్కారం లేదా అని నవీన్ పోలిశెట్టిని తిట్టడంతో.. సంస్కారం ఇంపార్టెంట్రా అంటూ డాగ్‌లా ప్లేట్ లో తలపెట్టి తినడం వీడియోకే హైలెట్. `మిమ్మల్ని నవ్వించడం నాకెంతో ఇష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆన్ స్క్రీన్ పై కలుద్దాం` అంటూ నవీన్ వీడియోను ముగించాడు. నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు నవీన్ పోలిశెట్టి త్వరగా కోలుకోవాలని.. స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.
NEW VIDEO. Life oka zindagi aipoyindi 😜 See you soon JaaneJigars ❤️ pic.twitter.com/6sNZ4L7nt4
— Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2024