మతమార్పిడిపై AP సీస్ కి నోటీసులు జారీ చేసిన జాతీయ SC కమిషన్. 15 రోజుల్లో స్పందించకపోతే ఆర్టికల్ – 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇంతకీ దీని వెనుక ఏం జరిగింది అంటే… ఏపీలో నానాటికీ అత్యంత వేగంగా మత మార్పిడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2019 నుంచి ఈ మతమార్పిడులు వేగం పుంజుకున్నాయి.
ఇదేసమయంలో ప్రభుత్వం పలు చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వాస్తవానికి మనది లౌకిక రాజ్యంగం అనుసరించే దేశం కాబట్టి ఇలా మతోద్ధరణకు ప్రభుత్వం పాటుపడకూడదు. మరి ఏ చట్టం ప్రకారం చేశారో గాని నిధులు విడుదల చేశారు.
ఈనేపథ్యంలో ఒక పౌరుడి ఫిర్యాదు మేరకు కేంద్ర ఎస్సీ కమిషన్ స్పందించి ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. వీటికి కచ్చితంగా సమాధానం ఇచ్చి తీరాలి. లేకపోతే ఆర్టికల్ – 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ స్పష్టం చేసింది.
#Breaking
Following our representation based on data provide by LRPF @lawinforce, the National Scheduled Castes Commission issued notice to Chief Secretary of Andhra Pradesh seeking action taken report within 15 days in the matter of Christian Conversions targeting SC community https://t.co/qFchvG4INE pic.twitter.com/JPns90Lchr— SC ST RIGHTS FORUM (@SCSTForum) July 20, 2021