టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలాకాలం వరకు ఈ విషయాన్ని గుట్టుగా దాచారు ఈ ఇద్దరు. ఆ తర్వాత నరేష్ మూడో భార్య రమ్య…వారిద్దరూ ఉన్న హోటల్ గది దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేయడంతో ఆ సీక్రెట్ బట్టబయలైంది. ఆ తర్వాత నరేష్, పవిత్రలు పలు సందర్భాల్లో జంటగా కనిపించడంతో మీడియా, సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్ మొదలైంది.
దీంతో, ఈ వ్యవహారంపై పవిత్రా లోకేష్, నరేష్ లు పలుమార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమపై అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్స్ పై పరువు నష్టం దావా కేసును కోర్టులో ఫైల్ చేశారు. కానీ, తాము సహజీవనంలో లేము అంటూ వీరిద్దరూ ఎక్కడా ఖండించలేదు. దీంతో, వారిపై ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే నరేష్, పవిత్రలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా నరేష్ తన ట్విటర్ ఖాతాలో విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవిత్ర లోకేష్ కు నరేష్ లిప్ లాక్ ఇస్తూ తాము పెళ్లి చేసుకోబోతున్నామని సంచలన ప్రకటన చేశారు. ‘కొత్త సంవత్సరం. కొత్త ప్రారంభం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని నరేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
తన కాబోయే భార్య పవిత్రను దగ్గరకు తీసుకొని లిప్ లాక్ ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఒకరికొకరు కేక్ తినిపించుకున్న తర్వాత ఫ్రెంచ్ కిస్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. ‘గెటింగ్ మ్యారీడ్ సూన్’ అంటూ నరేష్ పెట్టిన ఈ వీడియో టాలీవుడ్ లో కాక రేపుతోంది.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022