టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ రోజు నుంచి పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు `ఇక మొదలెడదామా!`అంటూ షూ లేస్ కట్టుకుంటున్న లోకేష్ కామెంట్ పిచ్చ ట్రెండింగ్లో ఉంది. దీనిని భారీ ఎత్తున నెటిజన్లు లైక్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. `మేం కూడా రెడీ` అంటూ.. మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా `యుద్ధం మొదలైంది` క్యాప్షన్ కు విశేష స్పందన వస్తుండడం గమనార్హం. తాజాగా టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ షూ.. లేస్ కట్టుకుంటూ.. `యుద్ధం మొదలడదామా!` అని చేసే వ్యాఖ్య ఇది. యువగళం పాదయాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. 11.20 గంటలకు తాటిపాక సెంటర్లోని బహిరంగసభలో పాల్గొనే ఆయన.. గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం.. రజక సామాజిక వర్గంతోనూ భేటీ అవుతారు.
కాగా.. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. అనేక ఇబ్బందులు.. సమస్యలను ధైర్యంగా అధిగమిస్తూ.. ముందుకు సాగింది. అయితే.. సెప్టెంబరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టడం.. ఆవెంటనే ఆయనను అరెస్టు చేయడం.. జైలుకు తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. అప్పటికే ఆయన 209 రోజుల పాటు పాదయాత్ర చేసి.. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో విరామం ఇచ్చారు. ఇక, ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాగా.. ఈ రోజు 210 వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది.
యువగళం పునఃప్రారంభం ???? #YuvaGalamPadayatra #AndhraPradesh #NaraLokesh pic.twitter.com/mQiKX3P55o
— iTDP Official (@iTDP_Official) November 27, 2023