బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చాలాకాలం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం బిగ్ బాస్ అంటూ ఇటీవల నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, గతంలోగానీ, ఇటీవలగానీ నారాయణ వ్యాఖ్యలపై నాగార్జున స్పందించిన దాఖలాలు లేవు. అయితే, గత శనివారం బిగ్ బాస్ షోలో మాత్రం నారాయణపై నాగార్జున పరోక్షంగా సెటైర్లు వేశారు.
కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ నారాయణపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. హౌస్ లో ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్ లను హగ్ చేసుకోమని నాగ్ అన్నారు. ఆ సందర్భంగా ‘నారాయణ.. నారాయణ.. వాళ్లు పెళ్లయినవాళ్లు’ అంటూ నారాయణనుద్దేశించి నాగ్ పరోక్షంగా చురకలంటించారు. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జున వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు.
‘బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లైన జంటకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నా.. మరి మిగతా వాళ్లకి ఏం చేశారు.? వాళ్లకేం పెళ్లిళ్లు కాలేదు కదా.. వాళ్లేం బంధువులు కాదు కదా.. మరి వాళ్లేం అయ్యారు.. వందరోజులు పాటు వాళ్లేం చేస్తారో అది కూడా చెప్పన్నా.. నాగన్నా.. నాగన్నా.. ఈ బిగ్ బాస్ షోలో’ అంటూ వెటకారంగా నారాయణ వ్యాఖ్యానించారు. మరి, నారాయణ తాజా వ్యాఖ్యలపై నాగార్జున స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.
కాగా, గతంలో బిగ్ బాస్ హౌస్ బ్రోతల్ హౌస్ అని, అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లంతా సంసారులు కాదని నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా అక్కడ ఏదోటి చేసుకునే బయటకు వస్తారని, అది రెడ్ లైట్ ఏరియా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ వెళ్లి వచ్చిన వాళ్లు పతివ్రతలంటే తాను ఒప్పుకోనని.. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు హౌస్‌లోకి వెళ్లి.. లోపల ఏం చేసుకుంటున్నారు? ఏం జరుగుతుందో ఓపెన్‌గా చూపిస్తారా? అంటూ ఛాలెంజ్ చేశారు నారాయణ. నాగార్జునపై, వాళ్ల ఇంట్లో ఆడవాళ్లపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతోనే నాగ్ తొలిసారి స్పందించారు.