ఏపీ టిక్కెట్ ధరల గోల స్టార్ హీరోల అసలు రంగును బయటపెట్టింది.
తెలుగు సినిమాలను తెలుగు ముఖ్యమంత్రే తొక్కేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోగొట్టారు ఏపీ సీఎం.
కరోనా, ఏపీ సర్కారు ఇద్దరు కలిసి టాలీవుడ్ ను నలిపేశారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్లో అందరూ ఏకమై పోరాడకుండా భయపడి చస్తున్నారు.
పవన్, బాలయ్య, నాని ముగ్గురు తప్పుడు నిర్ణయాలు అని మాట్లాడుతూ సినిమా వాళ్లు ఎవరూ మద్దతు పలకలేదు.
ఏపీలో టిక్కెట్ ధరలపై పలువురు సినీ నిర్మాతలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలు చేపట్టారు. టిక్కెట్ ధరలు అట్టడుగున ఉన్నందున, మధ్యస్థ మరియు భారీ-బడ్జెట్ చిత్రాలకు వాటి ఖర్చులను తిరిగి పొందడం చాలా కష్టం.
పవన్ కళ్యాణ్ నుండి నాని నుండి నారాయణ మూర్తి నుండి రామ్ గోపాల్ వర్మ వరకు బహిరంగంగానే ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కానీ జగన్ మనిషిగా చెప్పుకునే మోహన్ బాబు, నాగార్జున టిక్కెట్ ధరలపై స్పందించిన తీరు ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది.
నాగార్జున తన బంగార్రాజు సినిమాకు ఏపీలో ఇప్పుడున్న టిక్కెట్ ధరలు సరిపోతాయని పేర్కొనడం ఘోరం. టిక్కెట్ ధరలు తన సినిమాపై ప్రభావం చూపబోవని చెప్పారు.
అంటే నాగ్ సినిమాలకు ప్రాబ్లం లేదు కాబట్టి మిగతా సినిమాలకు ప్రాబ్లం వస్తే అది నాగ్ కి సంబంధం లేదన్నమాట.
సీఎంతో చనువు ఉన్న టాలీవుడ్ నేతే ఇలా మాట్లాడితే… మిగతా వారి పరిస్థితి ఏంటి?
పరిశ్రమలో టిక్కెట్ ధరలపై నాగార్జున చేసిన వ్యాఖ్యలను చాలా మంది ‘స్వార్థపూరితం’గా వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన టిక్కెట్ రేట్ల వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
నాగార్జునకు ఈరోజు నొప్పి లేకపోవచ్చు … కానీ రేపు ఆయనకు ఇబ్బంది వచ్చినపుడు ఇండస్ట్రీ అండగా నిలబడుతుందా? చూడాలి.