యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన రాబోయే చిత్రం `తండేల్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చైతూ , సాయి పల్లవి జంటగా నటించారు. శ్రీకాకుళంలో వాస్తవంగా జరిగిన ఓ స్టోరీ ని ఆధారం చేసుకుని తండేల్ మూవీని రూపొందించారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మంగళవారం రాత్రి వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్స్ ప్యాలెస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా చైతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చైతూ మాట్లాడుతూ.. `ఏడాదిన్నర నుంచి నా లైఫ్ లో నిజమైన తండేల్ అల్లు అరవింద్ గారే. ఆయన గైడెన్స్ ఎంతో విలువైనది. అలాగే వైజాగ్ నాకు చాలా క్లోజ్. ఏ సినిమా విడుదల తర్వాతైనా వైజాగ్ టాక్ గురించే మొదట తెలుసుకుంటా. ఎందుకంటే, వైజాగ్ లో సినిమా ఆడిందంటే.. ఎక్కడైనా ఆడాల్సిందే.
ఇక వైజాగ్ అమ్మాయి(శోభిత)నే ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. ఫ్యాన్స్ కు చిన్న రిక్వెస్ట్. వైజాగ్ లో తండేల్ కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటూ ఇంట్లో పరువుపోద్ది` అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు తండేల్ సినిమాను నిర్మించారు. ఇందులో చైతూ మత్స్యకారుడుగా కనిపించనున్నాడు. లవ్ స్టోరీ కమ్ దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.