ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు లేక సతమతం అవుతున్న హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో నభా నటేష్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2019లో `ఇస్మార్ట్ శంకర్` మూవీతో నభాకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఈ వయ్యారి టాలీవుడ్ లో టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెట్ గా మారింది.
`డిస్కో రాజా`, `సోలో బ్రతికే సో బెటర్`, `అల్లుడు అదుర్స్`, `మాస్ట్రో` వంటి చిత్రాలు పలకరించింది. కానీ ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో ఒక మేజర్ యాక్సిడెంట్ కారణంగా ఏడాదిన్నర పాటు వెండితెరకు దూరమైన నభా నటేష్.. 2024లో మళ్లీ `డార్లింగ్` మూవీ తో వెండితెరపై మెరిసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. డార్లింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నభాకు నిరాశే ఎదురైంది.
సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో గ్లామర్ షోకు తెర లేపింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కవ్వింపులకు దిగుతోంది. అందాలతో ఆఫర్లు పట్టాలని నభా గట్టి ప్రయత్నాలు చేస్తున్నా.. పట్టించుకునే నాధుడే కనించడం లేదు. తాజాగా కూడా బ్లాక్ శారీలో నాజూకు నడుమును హైలెట్ చేస్తూ క్రేజీగా ఫోటోలకు పోజులిచ్చింది. నభా లేటెస్ట్ పిక్స్ చూసి నెటిజన్లు అల్లాడిపోతున్నారు. కాగా, నభా నటేష్ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. అదే `నాగబంధనం`. విరాట్ కర్ణ ఇందులో హీరో. ఈయన `పెదకాపు పార్ట్ 1` వంటి డిజాస్టర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. విరాట్ కర్ణ రెండో సినిమా నాగబంధనం. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రాకరణలో దశలో ఉంది.