ప్రస్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ మంచి సక్సెస్ రేటు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. ఇటీవల `డాకు మహారాజ్` చిత్రంతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్న థమన్.. త్వరలోనే హీరోగా అలరింబోతున్నాడట. శంకర్ దర్శకత్వంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన `బాయ్స్` మూవీలో థమన్ తొలిసారిగా వెండితెరపై మెరిశాడు. ఈ చిత్రంలో మ్యూజిక్ బ్యాండ్ టీమ్‌లో ఒకడిగా థమన్ నటించాడు. ఆ తర్వాత నటన కంటే సంగీతానికే అధిక ప్రధాన్యత ఇచ్చిన థమన్.. సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.
సింధనై సే, అయ్యనార్ అనే తమిళ చిత్రాలతో పాటు మిస్టర్ మజ్ను, బేబీ జాన్ వంటి చిత్రాల్లో అతిధి పాత్రలో మెరిసిన థమన్.. ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా మారబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ యాక్టర్ అధర్వ కలిసి తమిళంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేసేందుకు థమన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ మల్టీస్టారర్ చిత్రంలో థమన్ లీడ్ యాక్టర్‌గా కనిపించనున్నాడని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే.. ఆన్ స్క్రీన్ పై థమన్ ఎటువంటి పాత్రలో అలరించనున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.