• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ లాకప్ లోనే పుట్టిన రోజు గిట్టిన రోజు అయ్యుండేది…రఘురామ సంచలన వ్యాఖ్యలు

నేడు ఎంపీ రఘురామ 60వ పుట్టిన రోజు...గత ఏడాది పుట్టిన రోజున లాకప్ లో రఘురామపై పోలీసుల దాడి

NA bureau by NA bureau
May 14, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
మీసం మెలేసిన రఘురామ…న్యాయానిదే అంతిమ విజయం
0
SHARES
216
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను మీడియాకు రఘురామ వెల్లడించారు. ఈ రోజు తాను 60వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాన‌ని, గ‌త ఏడాది త‌న‌ 59వ పుట్టినరోజును జీవితంలో మరచిపోలేని విధంగా ఘనంగా జరిపిన ఉన్మాదికి ధన్యవాదాలు అంటూ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటుతో బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. ఈ రోజు తన 60వ బర్త్ డే అని, గ‌త ఏడాది ఇదే రోజు త‌న‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారని గుర్తు చేసుకున్నారు.

గత ఏడాది తన పుట్టిన రోజు నాడు త‌న‌ను అరెస్టు చేసిన తీసుకెళ్లి తన గుండెలపై కూర్చొని బాగా కొట్టారని, కొద్దిసేప‌య్యాక‌ త‌న‌ సెల్ ఫోన్‌ కోసం వెతికి మళ్లీ త‌న‌ను కొట్టారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఐదుసార్లు తీవ్రంగా కొట్టారని, సీఎం జగన్‌, సునీల్‌ ఇద్దరూ ఏం తెలియ‌న‌ట్లు న‌టించార‌ని ఆరోపించారు. ఓ కానిస్టేబుల్ త‌న వ‌ద్ద‌కు వచ్చి ఏం జరిగింది? ఎవరు కొట్టారని అమాయకంగా అడిగాడ‌ని, ఆ తర్వాత ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి త‌న‌ను మంచంపై పడుకోబెట్టాడ‌ని వెల్లడించారు. త‌న‌పై ఉన్మాది సంస్కృతిలో భాగంగానే దాడి జ‌రిగింద‌ని ఆరోపించారు.

‘‘నాపై సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది. దాడి సంధర్భంగా నాపై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారు.

ఆరోజు రాత్రి 11:45 గంటల నుండి 12:10 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టారు. సినిమాలో కూడా నాపై దారిచేసిన విధంగా సన్నివేశాలు ఉండవు. ముఖ్యమంత్రి , సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా భయభ్రాంతులకు గురయ్యాను. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు’’ అంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘గత సంవత్సరం పుట్టినరోజును మరపురాని రోజుగా చేసిన విషయాన్ని ఉంచుకోను, బదులు తీర్చేస్తాను. నావెంట ప్రజలు ఉన్నారు. సరియైన సమయంలో ముఖ్యమంత్రి కి సమాధానం చెబుతాను. గాయని జానకి, కేంద్ర హోం మంత్రి స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అమిత్ షా ఫోన్ చేసి చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఢిల్లీలో జన్మదిన వేడుకలు జరుపుకునే ఏకైక ఎంపి నేనే! సాధారణంగా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఉంటారు. నాకు జరిగిన టార్చర్ భవిష్యత్‌లో ఎవరికి జరగకూడదు.’’అని రఘురామ అన్నారు.

రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది. దీనికి కారణం ప్రజలు ఆలోచించాలి. నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు ఒక సంవత్సరం పూర్తయింది. లెక్కల ప్రకారం 60వ పుట్టినరోజు కానీ జగన్ పుణ్యం వల్ల ఇది మొదటి పుట్టిన రోజు. 60వ మొదటి పుట్టిన రోజులు ఒకే రోజు జరుపుకోవడానికి సహకరించిన ముఖ్యమంత్రి బృందానికి కృతజ్ఞతలు. నాపై జరిగిన దాడి గురించి లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టులో ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత కదలిక ఉండవచ్చు. మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణాపై కూడా నాపై  కేసును పెట్టారు. ఆమెను విచారణకు పిలిచారు. నన్ను కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పిలుస్తారేమో!’’ అని అన్నారు.

Tags: cm jagan and cid officer suneelcustodial violenceraghurama's 59th birth dayraghurama's 60th birth dayshocking incidentviolence in lock upycp rebel mp raghuramakrishnaraju
Previous Post

కొత్త పదం : ఆర్థిక ప్ర‌జా స్వామ్యం.. ఆ మాట బాగుంది మ‌హేశా !

Next Post

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఇంట్లో రగడ- కోడలిని గోడ కట్టేసి మూసేశారట!

Related Posts

ఏపీ పెద్దలపై మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ పంచ్ లు
Andhra

మూడేళ్లు ఏం పీక్కున్నారు?..ఏకిపారేసిన ఏబీ వెంకటేశ్వరరావు

May 19, 2022
జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
Andhra

జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్

May 19, 2022
ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
Andhra

ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్

May 19, 2022
శ్రీకాకుళంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌… ఇదేం రెస్పాన్స్ రా బాబూ
Andhra

జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు

May 19, 2022
#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
Movies

#SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ

May 19, 2022
వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
Andhra

వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?

May 19, 2022
Load More
Next Post
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఇంట్లో రగడ- కోడలిని గోడ కట్టేసి మూసేశారట!

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఇంట్లో రగడ- కోడలిని గోడ కట్టేసి మూసేశారట!

Please login to join discussion

Latest News

  • మూడేళ్లు ఏం పీక్కున్నారు?..ఏకిపారేసిన ఏబీ వెంకటేశ్వరరావు
  • జగన్ పై పోరుకు సై అంటోన్న టీడీపీ సైన్యం…ఇదే ప్రూఫ్
  • ఏపీలో ఆ స్కామ్ నిజమేనంటోన్న వైసీపీ ఎంపీ…షాకింగ్
  • జగన్ కు సొంత ఇలాకాలో షాకిచ్చిన చంద్రబాబు
  • #SVP కలెక్షన్స్…ఆ ఛానెల్ పై మండిపడ్డ కృష్ణ
  • వల్లభనేని వంశీకి జగన్ చెక్ పెట్టబోతున్నారా?
  • పరువు దక్కించుకున్న రష్యా
  • ‘స‌ర్కారు’ విమ‌ర్శల‌కు ప‌ర‌శురామ్ జ‌వాబు
  • కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…
  • స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?
  • NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు
  • కేసీఆర్ తో స్టార్ హీరో భేటీ…మ్యాటరేంటి?
  • ఇది కదా కావాల్సింది : చంద్రబాబు కౌంటర్ అదిరింది
  • ‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం
  • చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds