2021లో జరిగిన టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నాయకులు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జైలుకు తరలించారు. ఇక, ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేసినట్టు తెలుస్తున్నా.. దీనికి సంబం ధించిన అధికారికసమాచారం బయటకు రావడం లేదు. మరోవైపు.. సోమవారం తెల్లవారు జామున మరికొందరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
ఎక్కడెక్కడో ఉన్న వీరిని వెతికి అరెస్టు చేయడంతోపాటు.. మరిన్ని సెక్షన్లు జోడించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమను ఇబ్బందులు పెట్టారంటూ.. పోలీసులు మరో సెక్షన్‌ను పెట్టారు. దీంతో వీరికి మరింత ఉచ్చు బిగుసుకుంది. ఇక, తాజాగా అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు రబ్బాని, ఆయన మిత్రులు ఉన్నారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులు కూడా ఉన్నారు.
ఇక, ఎమ్మెల్సీ తలశిలను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయ న హైదరాబాద్, బెంగళూరులో ఉన్నారన్న భిన్నమైన సమాచారం నేపథ్యంలో పోలీసులు రెండు బృం దాలను రెండు ప్రాంతాలకు పంపించారు. ఆయన అరెస్టు అయితే.. మరింత మంది పాత్రను వెలుగులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇదిలావుంటే.. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేష్ అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వారిలో ప్రముఖంగా గుర్తించిన.. జోగి అనుచరులు కుంచం జయరాం, కొండేపి వెంకట కోటేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారిస్తు న్నారు. మొత్తంగా.. అటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, ఇటు చంద్రబాబు నివాసంపై దాడి కేసుల వేగం మరింత పుంజుకుంది. అయితే.. కీలక నేతలు మాత్రం తప్పించుకోవడం గమనార్హం.