శ్రీమంతుడు లాంటి నాన్ బాహుబలి హిట్‌తో టాలీవుడ్లో ప్రస్థానం మొదలు పెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అప్పటికే ఆ సంస్థ యుఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. పెద్ద బ్లాక్‌బస్టర్‌తో నిర్మాణ సంస్థ ప్రయాణం ఘనంగా మొదలై.. టాలీవుడ్లోనే అతి పెద్ద బేనర్లలో ఒకటిగా ఎదిగింది మైత్రీ.
ఈ సంస్థ మొదలైనపుడు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లతో పాటు మోహన్ చెరుకూరి (సీవీఎం) కూడా భాగస్వామే. కొన్ని సినిమాల వరకు ఆయన ప్రయాణం కొనసాగింది. కానీ కొన్నేళ్ల కిందట ఉన్నట్లుండి ఆయన్ని మైత్రీ నుంచి బయటికి పంపించేశారు. ఎక్కడ తేడా వచ్చిందో ఏమో తెలియదు మరి. అప్పట్నుంచి మోహన్ పేరు ఎక్కడా వినిపించలేదు. ఆయన యుఎస్‌లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగించినట్లు సమాచారం. కాగా ఇప్పుడు మోహన్ సొంతంగా నిర్మాణ సంస్థ మొదలుపెట్టేశాడు.
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం గురించి నూతన సంవత్సరాది సందర్భంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వైరా క్రియేషన్స్ అనే కొత్త బేనర్ నిర్మిస్తోంది. ఆ సంస్థ మోహన్ చెరుకూరిదే. మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు మోహన్. మైత్రీ సంస్థలో గ్యాంగ్ లీడర్‌తో పాటు అంటే సుందరానికీ సినిమాలు చేశాడు నాని. కానీ అవి రెండూ అతడికి నిరాశనే మిగిల్చాయి.
ఇప్పుడు మైత్రీ మాజీ భాగస్వామితో అతను జట్టు కడుతున్నాడు. మరి అతడికి.. నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మోహన్‌కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇది ఒక తండ్రికి, అతడి కూతురికి మధ్య నడిచే కథ అని దీని ప్రి టీజర్ చూస్తే అర్థమైపోయింది. ఆ టీజర్ చాలా హృద్యంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించనుంది.