కేసీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ బీజేపీని బాగా డ్యామేజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ దీనిని ఒక అస్త్రంలా వాడుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం రైతులకు మద్దతు అని చెప్పి… ఢిల్లీ వెళ్లి శాలువా కప్పారు అని కాంగ్రెస్ పెద్దలు ఆరోపించారు.
కేసీఆర్ – మోడీ బేటీ… ఢిల్లీలో దోస్తీ – గల్లీ మే కుస్తీ అన్నట్టుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ వైఖరి చూస్తుంటే .. మరో 6 నెలల పాటు టీఆర్ఎస్ నేతలపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్ధమైంది అంటూ ఆరోపించారు.
కాంగ్రెస్ ఆరోపణల సంగతి అటుంచితే… కేసీఆర్ టూర్ పై చాలామందికి అనుమానాలు కలిగాయి. ఒకవైపు మమత బెనర్జీ లాగే మోడీకి వ్యతిరేకం అని బాకా ఊదుతారు. కానీ మమతా బెనర్జీ ఏనాడూ మోడీకి ఇలా వంగి దండం పెట్టదు. కానీ కేసీఆర్ మాత్రం వంగి వంగి మోడీకి దండాలు పెడుతున్నాారని… కేసీఆర్ మోడీ చేతిలో కీలుబొమ్మ అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
వారి ఆరోపణల్లో తప్పేమీలేదు. చాలా రాంగ్ టైంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. కనీసం రైతుల ఉద్యమం చల్లబడే వరకు ఆగినా బాగుండేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.