ఇండియా డయాస్పోరా-అగస్త్య ఫౌండేషన్ సంయుక్త నిర్వహణ
గురువారం ఉదయం 10.30 గంటలకు ముహూర్తం
రోజు రోజంతా నివాళి కార్యక్రమాలు.. ఆహ్వానం పలికిన నిర్వాహకులు
భారత దేశ గణిత శాస్త్ర పితామహుడుగా పేరొందిన శ్రీనివాస రామానుజన్ స్మృత్యర్థం అమెరికాలోని భారత సంతతి వ్యక్తులు (ఇండియా డయోస్పోరా), అగస్త్య ఫౌండేషన్ సంయుక్తంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపోశాయి.
బోస్టన్లోని ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోని గణిత శాస్త్ర విభాగంలో రామానుజన్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు.
అగస్త్య ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని(ఛాతీ వరకు ఉన్న) గత ఏడాదే యూనివర్సిటీకి బహూకరించడం విశేషం.
ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి జయప్రకాష్ షిర్గాంకర్ రూపొందించారు.
గురువారం (ఏప్రిల్ 20) నాడు, రోజు రోజంతా రామానుజన్‌కు ఘన నివాళులర్పించేలా నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
ఎంఐటీలోని గణిత శాస్త్ర విభాగం ఆవరణలో గురువారం ఉదయం 10.30 గంటలకు రిబ్బన్ కటింగ్‌తో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమాలు రోజంతా సాగనున్నాయి.
ఉదయం కార్యక్రమం అనంతరం, మధ్యాహ్నం విందును ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం కార్యక్రమంలో భాగంగా ఎంఐటీలో దక్షిణాసియా చారిత్రక ప్రాజెక్టును వివరిస్తారు.
ఈ ప్రాజెక్టు వ్యవస్థాపకులు, దక్షిణాసియాతో ఎంఐటీ సంస్థకు ఉన్న అనుబంధాన్ని సమగ్రంగా వివరించనున్నారు.
అదే రోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటలవరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
అదేవిధంగా బోస్టన్లోని రాయల్ సొనెస్టాలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకున్న ప్రతి ఒక్కరినీ నిర్వాహకులు ఆహ్వానించారు.
కమ్యూనిటీ లీడర్స్ రేష్మా కేవల్రమణి, నిరేన్ చౌదరి, తరుణ్ ఖన్నాల మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
భారతీయ డయాస్పోరా విజయ గాథలను గుర్తు చేసుకునేందుకు, విద్యాపరమైన అంశాలపై మరింత అవగాహనను పెంపొందించడానికి ఇది చక్కని వేదిక అని నిర్వాహకులు తెలిపారు.
సాయంత్రం కార్యక్రమాల్లో ముగ్గురు కమ్యూనిటీ నాయకులు సీఈఓ, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ రేష్మా కేవల్రమణి, పనేరా బ్రెడ్‌లో CEO; హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ నిరేన్ చౌదరి, హార్వర్డ్ యూనివర్సిటీ లక్ష్మీ మిట్టల్ & ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ ఖన్నా పాల్గొంటారు.
రామానుజన్ గురించి సంక్షిప్తంగా..
తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన రామానుజన్ 32 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు.
తమిళనాడులోని కుంభకోణంలో ఆయన మరో ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఒకే గది ఉన్న ఇంట్లో పెరిగారు.
వాస్తవానికి ఆయన అధికారికంగా ఎలాంటి విద్యను అభ్యసించలేదు. అయితే, ఆయనలోని జిజ్ఞాస, సొంత ఆవిష్కరణల ద్వారా అనేక సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు.
అయితే, ఆయన సిద్ధాంతాలను స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో ఇంగ్లండ్‌లోని వివిధ కళాశాలల్లోని ప్రొఫెసర్లకు రాయడం ప్రారంభించారు.
మద్రాసులో పనిచేసిన సివిల్ ఇంజనీర్ సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ తన కార్యాలయంలో గుమాస్తాగా ఉన్న రామానుజన్ సామర్థ్యాన్ని గుర్తించారు.
అనంతర కాలంలో స్ప్రింగ్ రామానుజన్‌ను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపించారు.
`మనలో చాలా మంది ఒక సంవత్సరంలో చేసిన పనికంటే ఎక్కువ సిద్ధాంతాలను రామానుజన్ ఒక రోజులో నిరూపించాడు’ అని ప్రముఖ ప్రిన్స్టన్ గణిత శాస్త్రజ్ఞుడు మంజుల్ భార్గవ 2016లో వ్యాఖ్యానించారు.
రామానుజన్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం “ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ“ ప్రివ్యూ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం.
రామానుజన్ భార్య జానకి తో