`మా నమ్మకం నువ్వే జగన్` నినాదంతో రాష్ట్రంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిని ప్రజలు ఎలా నమ్మాలనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఎందు కంటే.. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అంటిస్తున్నారు. దీంతో పాటు ఒక కరపత్రాన్ని కూడా అందిస్తున్నారు. ఈ కరపత్రంలో ప్రభుత్వ పథకాలతోపాటు.. ఒక క్యాలండ ర్ను కూడా ముద్రించారు.
దీనిలో ప్రభుత్వ సెలవులను ముద్రించారు. అయితే.. ఇవన్నీ కూడా తప్పుల తడకలుగా ఉండడంతో “ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే.. మున్ముందు ఎలా నమ్మాలి? జగన్!“ అని ప్రజలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఇక, ఈ క్యాలండర్లో ప్రచురించిన తేదీలను.. సెలవులను చూస్తే.. చాలా చిత్రంగా ఉన్నాయి. తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన అని ముంద్రించారు. ఇక, పేరులోనే శుక్రవారం వున్న `గుడ్ ఫ్రైడే` గురువారం అని పేర్కొన్నారు.
దీంతో ఈ చిత్రాలు చూసి.. ప్రజలు నవ్వుకుంటున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట వైసీపీ ప్రభు త్వం ప్రారంభించిన ఇంటింటా సర్వే కార్యక్రమంలో పంపిణీ చేస్తున్న కరపత్రాలపై 2023 క్యాలెండర్‌ను ప్రచురించారు. వాటిల్లో సెలవుల వివరాల్లోని తప్పులు అందరినీ గందరగోళంలో పడేశాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతికి బదులు సంక్రాంతి అని, ఏప్రిల్ 6వ తేదీ గురువారం రోజున ‘గుడ్‌ఫ్రైడే’ అని ప్రచురించారు.
ఏడాదిలో రెండు సార్లు సంక్రాంతి పండగ ఏంటో అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్య మంత్రి ఫొటోతో ఉన్న కరపత్రంలోనే ఇన్ని తప్పులు దొర్లితే పట్టించుకోని వారు.. ఇక, పాలనలో తప్పులు పట్టించుకునే తీరిక ఎక్కడుందనే విమర్శలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. సో.. ఇదీ.. వైసీపీ చిత్రమైన పాలనకు నిదర్శనమని అంటున్నారు.