ఇప్పటికిప్పుడు వైసీపీకి వచ్చిన కష్టాలేం లేవు. ఆ మాటకు వస్తే మోడీ టీం కూడా జగన్ బాబుకు (విజయమ్మ అలానే పిలుస్తారు ఆయన్ను) అనుకూలంగానే ఉంది. విచిత్రం ఏంటంటే మోడీకి చెందిన తెలుగు టీంలు కొన్ని జగన్ బాబును ఫక్తుగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ మోడీకి తెలిసిన హిందీ మీడియం మనుషులు అయిన అదానీ, అంబానీలు జగన్ కు మద్దతుగానే ఉన్నారు.
ఎందుకంటే పరిమళ్ నత్వానీ కి ఎంపీ పోస్టు దక్కింది. ఇక గౌతమ్ అదానీ భార్య ప్రీతీ అదానీ కీ పదవి రానుంది. రాజ్యసభకు సంబంధించి వచ్చే జూన్ లో ఆమె ఎన్నిక లాంఛనం కానుంది. అప్పుడు అంబానీ ఇప్పుడు అదానీ అంతే ! ఇక మిగతా విషయాలు గురించి చర్చ అనవసరం కూడా ! ఇక తాజాగా జరుగుతున్న రాజకీయ చర్చలోకి వచ్చేద్దాం.
రాజకీయం అంటే మాస్ ను ఆకట్టుకోవడం. మాసివ్ అట్రాక్షన్ కోసం పరితపించడం అన్నవి తప్పదు. కానీ వైసీపీ నాయకులు సీఎం జగన్ వద్దంటున్నా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై టీడీపీ కన్నా మోడీ తెలుగు టీం బాగా స్పందిస్తోంది సోషల్ మీడియాలో ! మంత్రి పదవి వచ్చినపుడు చిలకలూరి పేట హైవే లో విడదల రజని (మంత్రి, వైద్యారోగ్యం) అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆ విధంగా మోడీ తెలుగు టీం మండిపడుతోంది. ఈ విషయంలో శ్రీశయన సామాజక వర్గానికి చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు కొంత బెటర్.
నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్ లో.😠
ఏకంగా చిలకలూరిపేట పట్టణంలో…
ఇలా వారాల తరబడి రోడ్డుకు అడ్డంగా బ్లాక్ చేస్తూ.. వైఛీప్స్ గాళ్ళు ఇలా కటౌట్ పెట్టినా.. తీయని లఫూట్ జగన్ పోలీసులని.. జఫ్ఫా మున్సిపల్ అధికారులని.. ఏమనాలి.💦
ఇదే విధంగా TDP నాయకులు కూడా పెడితే ఒక్క గంటైనా ఉంచుతారా? pic.twitter.com/BOOngGcGyy
— TDP Balaji® (@tdpbalaji) May 7, 2022
5647872