ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. గతంలో టీడీపీలోనూ పనిచేశారు. ఇప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్నారు. అయితే.. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకంగా కూటములు వెలుస్తుండ డం.. నియోజకవర్గంలో అంతర్గతంగా ఆమెకు వ్యతిరేక ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఆమే.. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఈమెపై నియోజకవర్గంలో చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. అయితే.. ఆమె ఆ ఎక్స్పెక్టేషన్లను చేరుకోకపోగా.. పార్టీలోనూ.. దూరంగా ఉంటున్నారు.
వాస్తవానికి కొవ్వూరు నియోజకవర్గం.. టీడీపీకి కంచుకోట. వరుస విజయాలు దక్కించుకున్న పార్టీ కూడా. అలాంటి చోట గత వైసీపీ సునామీలో వనిత విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే మంత్రి వర్గంలోనూ చోటు సంపాయించుకున్నారు. అయితే.. మంత్రిగా ఉండడంతో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేక పోతు న్నానని.. ఆమె చెబుతున్నారు. కానీ, మంత్రిగా ఉన్నప్పటకీ.. వారంలో నాలుగు రోజులు నియోజకవర్గం లోనే ఉంటున్నారని..కానీ, తమకు మాత్రం పనులు చేసి పెట్టడం లేదని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి.. గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇక్కడ నుంచి జవహర్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
ఆయనపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆయన తమను పట్టించుకోవడం లేదని.. నేతలు.. ప్రజలు కూడా భావించారు. ఇప్పుడు మరోసారి ఈ నియోజకవర్గానికి వరుసగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే.. గతంలో జవహర్ మంత్రిగా చేయగా.. ఇప్పుడు వనిత మంత్రిగా ఉన్నారు. కానీ, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనేది ఇక్కడ ప్రజల టాక్. దీంతో ఎవరిని గెలిపించినా.. ఒక్కటే అనే భావన వీరిలో వ్యక్తమవుతుండడం.. డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. మరోవైపు.. సొంత పార్టీలోనూ.. నేతలు కూటమలు కడుతున్నారు.
తమకు పనులు చేయించడం లేదని.. ఒకవర్గం చెబుతుంటే.. మరోవర్గం.. అసలు తమకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అంటున్నారు. మొత్తంగా చూస్తే.. మంత్రి పరిస్థితి తీవ్ర ఇరకాటంలో పడింది. వాస్తవానికి మంత్రి నియోజకవర్గంలోనే ఉంటున్నారు. అయితే.. ఆమె కేవలం ప్రారంభోత్సవాలు.. సమీక్షలు.. రిబ్బన్ కటింగులు.. వంటి వాటికే పరిమితమై.. పోతున్నారనేది.. పార్టీ నేతల ఆవేదన. అదేసమయంలో ఎప్పటి నుంచో సమస్యలు గా ఉన్న వాటిని కూడా మంత్రి పట్టించుకోకపోతే ఎలా? అనేది ఇక్కడి ప్రజల టాక్. వెరసి.. మంత్రికి ఇబ్బందులు మాత్రం చుట్టుముడుతున్నాయి