తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల అక్రమాలను బయట పెట్టిన వారిని చంపేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తాజాగా భూపాలపల్లి జిల్లాలో జరిగిన మేడి గడ్డ రిజర్వాయర్ కుంగుబాటు ఘటనపై ఫిర్యాదు చేసిన రాజలింగ్ హత్యపై మంత్రి స్పందించారు. ఈయన హత్యకు గలకారణాలను సాధ్యమైనంత వేగంగా వెలకి తీస్తామన్నారు.
కేసీఆర్ కుటుంబ అవినీతిని వెలికి తీసిన కారణంగానే రాజలింగ్ హత్యకు గురి కావడం విస్మయం కలిగి స్తోందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా.. వనరులను కూడా దోపిడీ చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజధనాన్ని సొంతం చేసుకున్నారన్న మంత్రి కోమటిరెడ్డి.. దీనిని వెలికి తీసిన రాజలింగం హత్య కావడం వెనుక ఎవరున్నారో తేలుస్తామని చెప్పారు.
ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేయాల్సిన వారు.. ఇలా హత్యారాజకీయాలకు పాల్పడుతారని అనుకోలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాజలింగ హత్య కేసును సీఐడీకి అప్పగించేలా ముఖ్యమంత్రి రేవంత్ ను కోరనున్నట్టు తెలిపారు. కేసీఆర్పై న్యాయ పోరాటం చేస్తున్నచక్రధర్ రెడ్డికి అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని మంత్రి చెప్పారు. అంతేకాదు.. కేసీఆర్ నుంచి ప్రాణ భయం ఉన్న వారు ఎవరైనా కూడాధైర్యంగా ముందుకురావాలని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు.