• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

admin by admin
May 29, 2025
in Around The World, NRI, Top Stories, Trending
0
0
SHARES
585
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు ‘మినీ మహానాడు – 2025’ కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ ‌లో అంగరంగ వైభంగా ముగిసింది.

బే ఏరియాలోని భీమవరం రుచులు బాంకెట్ హాల్ లో బుధవారం రాత్రి 7 గంటలకు మొదలైన ఈ ఈవెంట్ ను నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్నరీతిలో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత అన్న ఎన్టీఆర్‌ కు ఘన నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు వర్చువల్ గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, ఎన్నారై ఎంపవర్ మెంట్ అండ్ రూరల్ పోవర్టీ ఎలిమినేషన్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్..కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు…వేమూరు టీడీపీ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు…తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుచ్చి రాం ప్రసాద్…తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న…టీడీపీ మాజీ నేత, బీఈర్ఎస్ నేత, ఎన్టీఆర్ వీరాభిమాని ఎల్ రమణ….ఎన్నారై టీడీపీ అధ్యక్షులు, ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరు..ఎన్నారై టీడీపీ యూఎస్ ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వర్చువల్ గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం సంతోషంగా ఉందని జయరాం కోమటి అన్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి సత్తా చాటడానికి కారణం ఎన్టీఆర్ అని ప్రశంసించారు. అన్న ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచిన చంద్రబాబు ఐటీ రంగానికి ఊతమిచ్చారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై తెలుగు వారు చెరగని ముద్ర వేశారని అన్నారు.

అమెరికాలో మినీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని డాక్టర్ రవి వేమూరు అన్నారు. తెలుగు జాతి తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘన ఎన్టీఆర్ దని కొనియాడారు. అన్న ఎన్టీఆర్ ఆశయాల సాధనకు తమ వంతు కృషి చేస్తామని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు.

నవ్యాంధ్ర అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భవిష్యత్తులో ఏవిధమైన సహాయసహకారాలు అందించబోతున్నారు అన్న విషయాలపై ఎన్నారైలతో మాట్లాడారు. ఎన్నారైలు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని,అన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న ఎన్టీఆర్ వల్లే బీసీలకు రాజ్యాధికారం దక్కిందని ఎంపీ పంచలింగాల నాగరాజు అన్నారు. బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచిన పార్టీ టీడీపీ అని, సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పాటుబడతామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ టీడీపీ అని, అన్న ఎన్టీఆర్ ఆదర్శాల వల్లే తన వంటి ఎందరో నేతలు టీడీపీలో ఉన్నత పదవులు అధిరోహించారని నక్కా ఆనంద బాబు అన్నారు.

మంత్రి నారా లోకేశ్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలని కోరుకుంటున్నామని తిరునగరి జ్యోత్స్న అన్నారు. ఆంధ్రాలో జరిగిన మహానాడులో ప్రత్యక్షంగా, అమెరికాలో జరిగిన మినీ మహానాడులో వర్చువల్ గా పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో జరిగినట్లుగానే అమెరికాలో కూడా మినీ మహానాడును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి సక్సెస్ చేశారని ప్రశంసించారు.

అమెరికాలోని మినీ మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లా, తుడా పరిధిలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి ఎన్నారైలకు ఏవైనా సమస్యలుంటే తన కార్యాలయాన్ని సంప్రదించాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

తాను కూడా ఒకప్పుడు ఎన్నారైనే అని బుచ్చి రాం ప్రసాద్ అన్నారు. బ్రాహ్మణ కమ్యూనిటీ కోసం పార్టీపరంగా పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు.

మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు:1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత, సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి ఎన్నారైల సహకారం, ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి…వంటి 8 అంశాలతో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.

ఆ ఆరు సూత్రాల అమలుకు, పీ-4 కార్యక్రమానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని ఎన్నారై టీడీపీ నేతలు, ఎన్నారై టీడీపీ కార్యకర్తలు, ఎన్నారై టీడీపీ అభిమానులు ప్రతిజ్ఞ చేశారు.

లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చిన వర్కింగ్ డే రోజున జరిగిన మినీ మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం సంతోషాన్నిచ్చిందని శ్రీకాంత్ దొడ్డపనేని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, వర్చువల్ గా హాజరైన వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.

వెంకట్ అడుసుమల్లి, శశి దొప్పలపూడి, మురళి గొడవర్తి, చంద్ర గుంటుపల్లి, సురేష్ పోతినేని, సుబ్బా యంత్ర, భాస్కర్ వల్లభనేని, శివ ప్రసాద్ పరుచూరి, లక్ష్మణ్ పరుచూరి, ఎంవి రావు, రాజ మహాదాస్, రవి ఆలపాటి, విజేత శ్రీనివాస్, నారాయణ రావరపు, సందీప్ ఇంటూరి, సుధీర్ ఉన్నం, తిరుపతి రావు వలివేటి, సతీష్ బోళ్ల , ప్రకాష్ మద్దిపాటి, హరికృష్ణ గురజాల, శ్రీహర్ష యడ్లపాటి, వంశీ పాలడుగు, ఆదినారాయణ, నారాయణ రావరపు, బాలకృష్ణ కంతేటి, భరత్‌ ముప్పిరాల, అశోక్‌ మైనేని, రవి కిరణ్‌ ఆలేటి, మోహన్‌ మల్లంపాటి, హర్ష యడ్లపాటి, నవీన్‌ కొడాలి, నరహరి మర్నేని మరియు హరిబాబు బొప్పుడి తదితరులు పాల్గొన్నారు.

Tags: bay areamini mahanaduntr 102 birth day
Previous Post

టీడీపీ ఉంటేనే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌: చంద్ర‌బాబు

Next Post

కేటీఆర్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన కవిత

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Around The World

ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Around The World

ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Load More
Next Post

కేటీఆర్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన కవిత

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra