ఐఎస్బీలో అడ్వాన్సుడు మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలనీ కోర్సు చేస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా మొహాలి క్యాంపస్ లో నిర్వహిస్తున్న ఆఫ్ లైన్ తరగతులకు హాజరయ్యారు. ఇంతకాలం ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అవుతున్న ఎంఎల్ఏ ఆఫ్ లైన్ కోర్స్ మొదలవ్వటంతో మొహాలి క్యాంపస్ కు వెళ్లాల్సొచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళి మూడో సెమిస్టర్ కోర్సు తరగతులకు అటెండ్ అవుతున్నారు.
మంగళవారం క్లాస్ కు అటెండ్ అయిన వంశీకి హఠాత్తుగా ఎడమ చెయ్యి విపరీతంలా లాగినట్లు అనిపించిందట. వెంటనే అనుమానంతో వంశీ దగ్గరలోనే ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్ళిపోయారు. అక్కడ ఎంఎల్ఏకి అత్యవసరంగా అన్ని పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, 2డీ ఎకో లాంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తక్షణ ప్రమాదమేమీ లేదని తేల్చారు. అయితే ఎంఎల్ఏని ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎంఎల్ఏ ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే అసలు ఎంఎల్ఏకి ఏమైందనే విషయాన్ని మాత్రం డాక్టర్లు చెప్పటంలేదు. ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినందువల్ల ఎడమ చేయి లాగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే ఇంకేదన్నా సమస్య వచ్చిందా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. మామూలుగా హార్ట్ ఎటాక్ వచ్చినపుడే చేతులు బాగా లాగినట్లవుతుందని వైద్యులు చెబుతుంటారు. కానీ ఇపుడు ఎంఎల్ఏకి ఏమి జరిగిందని మాత్రం డాక్టర్లు చెప్పటంలేదు. చివరకు వంశీయే ఒక ప్రకటన చేయాలంతే.